ముక్కు మొహం తెలియని బిగ్ బాస్ పార్టిసిపేట్స్

news02 June 10, 2018, 10:26 p.m. entertainment

Bigg boss -2 first episode

హైదరాబాద్ : బిగ్ బాస్ -2 ఎన్నో అంచనాలు.. ఎన్నో ఎక్స్పెటేషన్స్ ... కానీ అంత లా కనిపించలేదు. బిగ్ బాస్ ప్రేక్షకులకు అసంతృప్తి మిగిలింది. దీనికి కారణం యాంకర్ నాని ప్రవర్తన. ఎంట్రీ లోనే నాని యాంకరింగ్ అంతలా ఆకట్టుకోలేకపోయింది.

Bigg boss -2

బిగ్ బాస్-2 అంటే ఎవరైనా బిగ్ బాస్ 1 తో పోల్చుకుంటారు. అక్కడ యాంకర్ జూ. ఎన్టీఆర్ చేసిన యాంకరింగ్ తో పోల్చుకుంటారు. ఇక్కడనే నాని వెనకబడ్డాడు. ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించిన అయన బాడీ లాంగ్వేజ్ కు బిగ్ బాస్ లో కనిపించిన బాడీ లాంగ్వేజ్ కు చాలా తేడా కనిపించింది. ఎన్టీఆర్ ను అలా కనిపించడం అందరికీ ఆసక్తిని కలిగించింది. బిగ్ బాస్ లో ఎన్టీఆర్ క్యారక్టర్ మన ఇంటి పక్కన ఉన్న కుర్రాడిలా అందరిని అలరించాడు. కానీ నాని ఎందుకో బిగుసుకుపోయి కనిపించాడు.

Bigg boss -2 review

బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో కూడా పెద్దగా ఆకట్టుకునే క్యారక్టర్ లేకపోవడం ఆడియన్స్ ను డిస్సపాయింట్ చేసింది. సోషల్ మీడియా, సినిమా ప్రేక్షకులతో పోల్చితే టివి ప్రేక్షకులు వేరుగా ఉంటారు. రోజూ వచ్చే సీరియల్స్ కు అల్వవాటు బడిన మహిళా మణులకు తోడు.. న్యూట్రల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాల్సి వుంటుంది. ఇప్పుడున్న పార్టిసిపేటర్లలో ఎవరు అంతగా తెలిసిన వాళ్ళు లేకపోవటం కూడా బిగ్ బాస్ కు మైనస్ గా కనిపిస్తోంది.

tags: Bigg boss-2, bigg boss Telugu participates, bigg boss host Nani, bigg boss Telugu episode-1, bigg boss Telugu contests, bigg boss Telugu rating, bigg boss entry episode, Babu gogineni, bigg boss house pics, bigg boss, bigg boss house place, big boss Telugu review, review on bigg boss, bigg boss contesters family, bigg boss host Nani, bigg boss Nani campare to NTR, bigg boss campare, bigg boss dances, bigg boss latest episode, bigg boss -2, bigg boss producers.

Related Post