ఎంఎల్ఎ సినిమా రివ్యూ....

news02 March 23, 2018, 2:37 p.m. entertainment

సినిమా పిల్లర్- నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తరువాత నటించిన ఎంఎల్ఎ సినిమా విడుదలైంది. అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా రివ్యూ మీ కోసం...
సినిమా- ఎంఎల్ఎ
తారాగణం- కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, పోసాని కృష్ణ మురళి, జయ ప్రకాశ్‌రెడ్డి, రవి కిషన్‌ తదితరులు
మ్యూజిక్- మణిశర్మ
నిర్మాతలు- కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వ ప్రసాద్‌
కథ, దర్శకత్వం- ఉపేంద్ర మాధవ్‌
న్యూసు పిల్లర్ రేటింగ్- 

పరిచయం.....
నందమూరి కళ్యాణ్ రామ్ ముందు నుంచీ కమర్షియల్‌ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కళ్యాణ్ నటించిన సినిమాల్లో చాలా వరకు  కమర్షియల్‌ కథలే ఉన్నాయి. ‘ఇజం’, ‘పటాస్‌’ ఈ వరసలోనివే ఎని చెప్పవచ్చు. తాజాగా ‘ఎం.ఎల్‌.ఎ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్. మంచి గుణాలున్నఅబ్బాయిగానే కాకుండా ఎమ్మెల్యే గానూ మెప్పిస్తానని సినిమా ప్రమోషన్లో చెప్పుకొచ్చాడు. 

ఎంఎల్ఎ సినిమా కధ.......
ఇక కధలోకి వెళ్తే.. అనుకోకుండా కల్యాణ్‌(కల్యాణ్‌రామ్‌) ఇందు(కాజల్‌)ను చూస్తాడు. సహజంగానే ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఐతే కొన్ని కారణాల వల్ల ఇందు.. కల్యాణ్‌ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది. ఇటువంటి సమయంలో ఇందు ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఇంకేముంది ఆ సమస్య నుంచి తన తెలివితేటలతో ఇందును బయటపడేస్తాడు కల్యాణ్‌. ఆ తరువాత ఇందుకి కల్యాణ్‌ పై ప్రేమ పుడుతుంది. ఐతే ఇందు నాన్న జయప్రకాశ్‌ రెడ్డి ఎమ్మెల్యేని అల్లుడిగా చేసుకోవాలని భావిస్తుంటాడు. 

ఇక ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాడప్ప(రవి కిషన్‌) ఉంటాడు. దాంతో ఇందును గాడప్పకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు ఇందు ఫాదర్. ఇటువంటి సమయంలో రోటీన్ గానే కల్యాణ్‌ వచ్చి ఇందుని ప్రేమిస్తున్నానంటాడు. అది విని ‘నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వు’ అని కల్యాణ్‌ తో చెప్తాడు జయప్రకాశ్‌. దాంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎమ్మెల్యే అవుతానని గాడప్పతో ఛాలెంజ్‌ చేస్తాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా.. ఇందూని పెళ్లిచేసుకుంటాడా అన్నదే అసలు కధ.

కధనం......
ఎంఎల్ఎ స్వతహాగా ఓ కమర్షియల్‌ సినిమా అని చెప్పవచ్చు. సినిమాలో ప్రతీదీ కమర్షియల్‌ గానే సన్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కధేమి కన్పించదు. కేవలం ఇందుని ఇంప్రెస్‌ చేయడానికి కల్యాణ్‌ పడే తాపత్రయం మాత్రమే కనిపిస్తుంది. కల్యాణ్‌ మంచి అబ్బాయిగా చూపించడానికి తొలి సగాన్ని వాడుకున్నాడు దర్శకుడు. కబ్జా అయిన ఇందు ఆస్తిని కాపాడటానికి కల్యాణ్‌ వేసే ప్లాన్‌, దాన్ని అమలు పరిచే తీరు అన్ని సినిమాల్లోలాగే లాజిక్‌ కి దూరంగా ఉన్నా సరదాగా అనిపిస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఆ ఎపిసోడ్‌ లో దొరకుతుంది. 

ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా కళ్యాణ్ ఎమ్మెల్యే అవడానికి చేసే ప్రయత్నం నుంచే మొదలవుతుంది. కమర్షియల్‌ విలువలతో పాటు చిన్న పిల్లలు చదువుకోవాలి తప్ప పనికి వెళ్ల కూడదు అనే మంచి పాయింట్‌ ని చూపించాడు. ప్రతి సన్నివేశం ఊహకు అందుతూ సాగుతుంటుంది. కానీ వినోదం మాత్రం ఖాయం. చాలా సన్నివేశాలు లాజిక్‌ కు దూరంగా ఉంటాయి. పాటలు, ఫైట్‌ లు, పంచ్‌‌ డైలాగులు కమర్షియల్‌ గానే సాగాయి. మొత్తంగా చూస్తే ఇది తెలిసిన కథే. కమర్షియల్‌ విలువలు జోడించి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు.

నటీనటుల ఫెర్ఫామెన్స్.....
పటాస్‌ నుంచి కల్యాణ్‌ లోఈజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో అది కనిపిస్తుంది. వినోదం, భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. స్టైల్‌, దస్తులు కూడా కొత్తగా ఉన్నాయి. ఇక కాజల్‌ అగర్వాల్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. తన పాత్రకీ ప్రాధాన్యం ఉంది. కానీ ద్వితీయార్థంలో కేవలం పాటలకే పరిమితమైంది. అటు రేసుగుర్రం తర్వాత రవికిషన్‌ కి ఆ స్థాయి పాత్ర దక్కిందని చెప్పవచ్చు. విలన్‌ గా బాగానే మెప్పించాడు. తొలి సగంలో వెన్నెల కిశోర్‌ ద్వితీయార్థంలో పృథ్వీ వినోదాన్ని పంచుతారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు కొంత అతిగా అనిపిస్తాయి. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.

Related Post