యుటర్న్ సినిమా రివ్యూ..

news02 Sept. 14, 2018, 3:28 p.m. entertainment

u turn

సినిమా పిల్లర్- అక్కినేని వారి కోడలు సమంత ప్రధాన పాత్ర పోషించిన యుటర్న్ సినిమా రివ్యూ మీకోసం..

సినిమా- యుటర్న్‌

తారాగణం- అక్కినేని సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్ త‌దిత‌రులు

నిర్మాతలు- శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు

దర్శకత్వం- పవన్ కుమార్

న్యూస్ పిల్లర్ రేటింగ్- 3/5

పరిచయం....

అక్కినేని సమంత సినిమాల్లో దుసుకుపోతోంది. మొన్న రంగస్థలం.. అ తరువాత మహానటి.. వెంటనే అభిమన్యుడు ఇలా వరుస సినిమాలతో జోరుమీదుంది. ఇదిగో మళ్లీ ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యుటర్న్.  కన్నడలో  సక్సెస్ అయిన సినిమానే తెలుగులో రీమేక్ చేశారు. ఆది పినశెట్టి, భూమిక తదితరులు నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా మరి..

samantha

సినిమా కధ..

ఇక సినిమాలోకి వెళ్తే.. రచన (సమంత) ఓ జర్నలిస్ట్. ట్రైనింగ్ లో భాగంగా ఓ కంపెనీలో చేరుతుంది. అదే కంపెనీలో ప్రర్మినెంట్ ఉద్యోగం సాధించేందుకు విభిన్నమైన కధనాన్ని రాయాలని నిర్ణయించుకుంటుంది రచన. ఇందుకోసం ఆర్కేపురం వంతెన దగ్గర యూటర్న్ తీసుకునే వాహనదారుల్ని ఎంచుకుంటుంది ఆమె. ఇక రచన వాళ్ల వాహనాల నంబర్స్ ఆధారంగా వారి వారి ఫోన్ నెబర్స్, అడ్రస్ లు కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ వాహనదారుడు సుందరం అడ్రస్ కనుక్కుని ఆయనింటికి వెళ్తుంది ఆమె. 

ఐతే రచన వెళ్లే సరికే సుందరం చనిపోయి ఉంటాడు. దీంతో పోలీసులు రచనను అనుమానించి విచారణ చేపడతారు. ఈ క్రమంలో ఓ ముఖ్యమైన డైరీ పోలీసులకు చిక్కుతుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ తీసుకనే వాళ్లంతా చనిపోతూ ఉంటారన్న నిజం పోలీసులకు డైరీ ద్వార తెలుస్తుంది. దీంతో షాక్ తిన్న పోలీసులు అసలు వంతెన దగ్గర యూటర్న్ తీసుకునే వాహనదారులు ఎందుకు చనిపోతున్నారు.. వాళ్లను చంపుతున్నది ఎవరు.. వాళ్ల మరణానికి రచనకు సంబంధం ఉందా అన్నదే యుటర్న్ అసలు కధ..

యుటర్న్ ఎలా ఉందంటే...

మన తెలుగులో ఇలాంటి సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమాలు కొత్త కాకపోయినా.. యుటర్న్ సినిమాను కొంత విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా మొత్తం ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని పెంచుతుంది. కేవలం ఫ్లైఓర్ యుటర్న్ అనే చిన్న అంశాన్ని ఎంచుకుని సస్పెన్స్ ను సృష్టించే కధనాన్ని అల్లడంలో అందరిని ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలో కొంత బోర్ అనిపించినా.. రాను రాను కధనంలో ఆసక్తి పెరుగుతుంది. కధ.. కధను మలిచిన విధానం కొత్తగా ఉండటంతో అంతకంతకు ఎగ్జైట్ మెంట్ కలుగుతుంది.

ఇక యుటర్న్ సినిమా అంతా ఓ పరిశోధన చుట్టూ తిరుగుతుంది. కధానాయిక రచన ఇంటర్వూ చేయాలనుకున్న వాళ్లే మరుసగా చనిపోతుండటం ఆసక్తికరం. వాళ్లంతా చనిపోతుండటంతో.. కనీసం మిగిలిన వారినైనా కాపాడాలన్న ప్రయత్నం ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ సినిమాకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. అరగంటకు పైగా ఉండే పతాక సన్నివేశఆలు హైలెట్ అని చెప్పవచ్చు.

u turn

ఇక యుటర్న్ సినిమాలో రచనగా నటించిన సమంత దే ప్రధాన పాత్ర. సమంత ఎంత మంచి నటో అందరికి తెలిసిందే. ఈ సినమాలోను ఆమె కధకు కావాల్సిన అన్ని హవభావాలను సమపాళ్లలో ప్రదర్శించింది. ఐతే సమంత డబ్బింగ్ కాస్త మైనస్ అయ్యింది. మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందని అనిపించింది. ఈ మధ్య నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఆదిపినిశెట్టి పోలీస్ అధికారి నాయక్ పాత్రకు ఒదిగిపోయాడు. భూమిక, రాహూల్ రవీంద్రన్ పాత్రలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

 

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: u turn, u turn review, u turn telugu movie review, u turn movie review, uturn telugu film review, u turn cinema review, u turn telugu moview, samantha in u turn, u turn movie rating

Related Post