సకుటుంబ సపరివార సమేతంగా..

news02 Jan. 2, 2019, 6:37 a.m. entertainment

ntr

కొత్త సంవత్సరం సందర్భంగా నందమూరి తారక రామారావు తన కుటుంబంతో విచ్చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఎన్టీఆర్ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ కు ప్రముఖ డైరెక్టర్ క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగానే ఈ సినిమాకు సంబందించిన పొస్టర్ ను విడుదల చేశారు. కేవలం న్యూ ఇయర్ మాత్రమే కాదు.. ఇందులో బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యా బాలన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది సినిమా యూనిట్. పోస్టర్‌లో ఎన్టీఆర్‌(బాలకృష్ణ‌)..తన సతీమణి బసవతారకం(విద్యాబాలన్‌)తో కలిసి తనయుడికి నామకరణం చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌ నందమూరి అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.  ఎన్టీఆర్ -కథానాయకుడు,  ఎన్టీఆర్ -మహానాయకుడు టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ కధానాయకుడు జనవరి 9న విడుదల అవుతోంది.

tags: ntr, ntr biopic, ntr movie, ntr biopic movie, ntr movie poster, ntr biopic new poster, ntr kathanayakudud, ntr mahanayakudu

Related Post