అకట్టుకుంటున్న మహానటి టీజర్..

news02 April 14, 2018, 9:54 p.m. entertainment

mahanati teaser

సినిమా పిల్లర్- మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందాల భామ కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర పోషిస్తోంది. ఇక మహానటి సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ ను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఉరుములు.. మెరుపుల శబ్దంతో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. ‘అన.. అనగ.. అనగగ.. అనగనగా ఒక మహానటి’ అంటూ టైప్‌ చేస్తూ.. డైలాగ్‌ను వినూత్నంగా రూపొందించారు. 

ఇక ఫస్ట్ ఫ్రేమ్‌ నుంచీ సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ చక్కగా ఒదిగిపోయిందని చిత్ర యూనిట్ చెప్తోంది.. కీర్టీ సురేష్ నవ్వు, నడక, హావభావాలు అచ్చు సావిత్రి లానే పలికించిందని అంటున్నారు. ఇక మహానటి టీజర్‌ ను సావిత్రి నటన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దృశ్యాలతో రూపొందించిన సంగతి తెలిసిందే. ముప్పై ఏళ్ల సినీజీవితంలో సావిత్రి అంటే అభిమానుల్లో ఉన్న ఇష్టాన్ని సైతం సినిమాలో చూపించారు.

ఇక మహానటిలో సమంత, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు తదితరులు‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సావిత్రి భర్త జెమిని గణేశన్‌ గా మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించాడు. మహానటికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు.‌ మరోవైపు మే 9న మహానటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Related Post