తనకంటూ ప్రత్యేక స్థానం

news02 Jan. 5, 2019, 8:11 a.m. entertainment

nayan

అంతాల భామ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందకంటే చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంలో మనసినక్కారే అనే సినిమా ద్వారా 2003లో నయనతార హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత తమిళంలో హరి దర్శకత్వంలో శరత్‌ కుమార్‌ జోడీగా అయ్యా సినిమా ద్వార ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించిన చంద్రముఖి సినిమాతో స్టార్ అయిపోయింది నయన్. ఇటు తెలుగులో 2006లో వెంకటేశ్ సరకన లక్ష్మీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిందీ అందాల భామ. ఆ తరువాత తమిళం, మలయాళ, తెలుగు భాషల్లో తిరుగులేని హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

nayan

అదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు నయనతార తన హవాను చాటుకుంటూ వస్తోంది. దక్షిణాది సినిమా ఇంటడ్స్రీలో టాప్ హీరోలందరితోను జోడీ కట్టిందీ ముద్దుగుమ్మ.  ఇటీవల మాయ, డోరా, అరం వంటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక చెప్పొచ్చేదేంటంటే 2003 డిసెంబరులో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నయనతార అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు పలువురు సినీ ప్రముఖులు కూడా నయన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా తోపాటు కొలైయుదిర్‌కాలం, ఐరా తదితర సినిమాల్లో నటిస్తూ నయనతార ఇప్పటికీ బిజీగా ఉంది మరి.

nayan

tags: nayan, nayanatara, nayanatara hot, nayanatara cine career, nayanatara movies, nayanatara films

Related Post