మేమేం చేయలేమన్న హై కోర్టు

news03 March 19, 2019, 8:26 p.m. entertainment

laxmis ntr

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల నేపధ్యంలో ఈ సినిమా విడుదల నిలిపివేయాలని సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశాడు. ఎలక్షన్ టైంలో ఇలాంటి సినిమా విడుదల చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలులుతుందని.. ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ntr laxmis

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించాడు రాంగోపాల్ వర్మ. ఈ మూవీలో ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు పోషించగా.. లక్ష్మీ పార్వతి పాత్రను కన్నడ నటి యజ్ఞ శెట్టి పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సోదరుడు కల్యాణి‌ మాలిక్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. 

https://newspillar.s3.amazonaws.com/media/WhatsApp_Image_2019-03-19_at_6.09.08_PM.jpeg

tags: ntr, laxmis ntr, ramgopal varma laxmis ntr, rgv laxmis ntr, high court on laxmis ntr, high court about laxmis ntr movie, sensor board about laxmis ntr movie

Related Post