అందుకు దైర్యం కావాలంటున్న కాజల్

news02 June 5, 2019, 4:21 p.m. entertainment

kajal

సినిమా ఇండస్ట్రీలో మేకప్‌ లేని ముఖాన్ని చూపించే సాహసం హీరోయిన్టు ఎవ్వరూ చేయరు. తన అందం, అభినయంతో తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల చందమామ కాజల్‌ అగర్వాల్ మేకప్ లేకుండా సహజంగా దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఇప్పడీ భామ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ ధైర్యానికి నెటిజన్లు, పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడమని ఈ ఫొటోలకు కాజల్ క్యాప్షన్‌గా పెట్టింది. మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి చాలా ధైర్యం కావాలని ఆమె చెప్పింది.

kajal

మనం శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామన్న కాజల్.. శరీరాకర్షణ ప్రతి చోటా ఉందని పేర్కొంది. మనలోని భిన్నమైన వ్యక్తిని చూపించాలి అనుకోకుండా.. మనల్ని మనం సహజంగా స్వీకరించుకోవడం మొదలు పెట్టినప్పుడు నిజంగా ఆనందంగా ఉంటామని తనదైన స్టైల్లో చెప్పంది కాజల్ అగర్వాల్. మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది.. కానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా అని ప్రశ్నించిందీ నెరజాన. మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉందని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

kajal

tags: kajal, kajal agarwal, kajal with out make up, kajal agarwal without make up, actress kajal with out make up, kajal about beauty, kajal agarwal hot

Related Post