శ్రీనివాస కళ్యాణం రివ్యూ..

news02 Aug. 9, 2018, 4:46 p.m. entertainment

nithn

సినిమా పిల్లర్- యువకధానాయకుడు నితిన్.. అందాల భామ రాశీ కన్నా.. సక్సెస్ నిర్మాత దిల్ రాజు, శతమానం భవతి దర్శకుడు సతీశ్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా రివ్యూ మీకోసం...

సినిమా- శ్రీనివాస కళ్యాణం.
నటీనటులు- నితిన్, రాశీ ఖన్నా, ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్రప్రసాద్, నరేష్ తదితరులు.
నిర్మాత- దిల్ రాజు
సంగీతం- మిక్కీ జే మేయర్
దర్శకత్వం- సతీష్ వేగేశ్న్.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం.....
దర్శకుడు సతీశ్ వేగేశ్న్ మొన్న తీసిన శతమానం భవతి సినిమా మంచి విజయం సాధించింది. పండగ నేపధ్యంలో తీసిన ఈ సినిమా తరువాత పెళ్లి నేపధ్యంలో సాగే కధను ఎంచుకున్నాడు. ఇదిగో ఆ సినిమానే శ్రీనివాస కళ్యాణం. నితిన్ కధానాయకుడిగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రధానంగా కుటుంబ కధా చిత్రాలను కోరుకునే అభిమానులు శ్రీనివాస కళ్యాణం సినిమాపై ఆసక్తిగా ఉన్నారని చెప్పవచ్చు.

raasi khanna

శ్రీనివాస కళ్యాణం కధ..
ఇక సినిమా కధలోకి వెళ్తే.. శ్రీనివాస్ (నితిన్) మంచి సంప్రదాయ కుంటుంబం నుంచి వస్తాడు. కట్టుబాట్లు, సంప్రదాయాలు. విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నేపధ్యం కుటుంబం నుంచే శ్రీనివాస్ కు వంటపడుతుంది. ఐతే ఇందుకు విరుద్దంగా కేవలం సమయానికి.. వ్యాపారానికి.. డబ్బుకు మాత్రమే విలువనిచ్చే వ్యక్తి ఆర్కే (ప్రకాష్ రాజ్). అతని కూతురే శ్రీదేవి (రాశీ ఖన్నా). కధలో భాగంగా శ్రీనివాస్, రాశీ ఖన్నా ప్రేమించుకుంటారు. అంతే కాదు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తన కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఘనంగా పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్ భావిస్తుండగా.. తన మనవడి పెళ్లి వారం రోజుల పాటు చేయాలని అతని నాయనమ్మ జయసుధ అనుకుంటుంది. మరి కేవలం డబ్బు, టైం కు విలువనిచ్చే ప్రకాశ్ రాజ్ వారి పెళ్లికి ఒప్పుకుంటాడా.. అసలు పెళ్లి జరుగుతుందా అన్నదే శ్రీనివాస కళ్యాణం అసలు కధ.

nithin

ఎలా ఉందంటే....
శ్రీనివాస కళ్యాణం సినిమా టైటిల్ లాగానే కళ్యాణం లోని మాధుర్యాన్ని.. ప్రాముఖ్యతను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకే పాత తరంలో జరిగే విధంగా ఇరవై ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి వారం రోజుల పెళ్లిని చూపించారు. అంతా బాగానే ఉన్నా.. చెప్పిన అంశాలనే మళ్లీ మళ్లీ చెప్పి బోర్ అనిపించాడనిపిస్తోంది. అంతే కాదు కేవలం సెంటిమెంట్ డైలాగ్స్ కోసం మాత్రమే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని చెప్పవచ్చు. ఆయా సన్నివేశాలు వచ్చినప్పుడల్లా రోటీన్ గా అనిపించకమానదు. సినిమాలో చాలా సందర్బాల్లో సెంటిమెంట్ ను చూపించినా.. అది కధలోన కాకుండా బయటే పైపైనా ఉందనే ఫీలింగ్ కలగడంతో ఆ సన్నివేశాలన్నీ తేలిపోయాయి.

srinivasa kalyanam

ఇక లవర్ బాయ్ లాగా.. మాస్ సినిమాలను చేసిన హీరో నితిన్.. ఇలా రాముడు మంచి బాలుడు అనే విధంగా చేయడంతో కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. అంతే కాదు నితిన్ లో ఉన్న ఎనర్జీ ఏ మాత్రం కనిపించలేదు. ఇక అందాల భామ రాశీ ఖన్న పాత్ర సైతం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. చాలా సందర్బాల్లో ఇది సినిమానా.. టీవీలో వచ్చే సీరియాలా అనిపించవచ్చు. కధలో వచ్చే డైలాగ్స్ బావున్నా.. అందుకు తగ్గట్టు సన్నివేశాలు లేవని చెప్పకతప్పడం లేదు. మొత్తానికి శ్రీనివాస కళ్యాణం కుంటుంబంతో చూడతగ్గ సినిమానే ఐనా.. పెద్దగా అలరించదని నా అభిప్రాయం.
 

tags: srinivasa kalyanam, srinivasa kalyanam review, rinivasa kalyanam movie review, srinivasa kalyana film, srinivasa kalyanam fil review, srinivasa kalyanam rating

Related Post