భారీ మొత్తానికి కాలా హక్కులు..

news02 April 26, 2018, 11:26 a.m. entertainment

kala satelight rights

సినిమా పిల్లర్- సూపర్ స్తార్ రజనీ కాంత్ నటిస్తున్న కాలా సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న రెండో చిత్రమిది. నిర్మాణానంతర పనులు కూడా పూర్తికావడంతో కాలా విడుదలకు సిద్ధమవుతోంది. జూన్‌ ఏడో తేదీన తెలుగు, తమిళం, హిందీతో పాటు ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక కాలా సినిమాలో నానాపటేకర్‌, సముద్రకని, హుమా కురేషి, షాయాజి షిండే తదితరులు నటించారు. 
kala movie

వండర్‌ బార్‌ సంస్థ బ్యానరుపై రజినీ కాంత్ అల్లుడు ధనుష్‌ నిర్మించిన ఈ సినిమా విడుదల హక్కులను లైకా సంస్థ సొంతం చేసుకుంది. మరోవైపు కాలా సినిమా శాటిలైట్‌ హక్కులకు పెద్ద స్థాయిలో పోటీ నెలకొంది. పెద్ద పెద్ద చాన్సల్స్ కాలా శాటిలైట్ హక్కుల కోసం పోటీపడ్డాయి. కానీ చివరకు స్టార్‌ నెట్‌వర్క్‌ సంస్థ పెద్ద మొత్తానికి శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాలా శాటిలైట్ హక్కులను 75 కోట్లకు స్టార్‌ నెట్‌వర్క్‌ కొన్నట్లు సమాచారం.

tags: kala, kaala, kala satelight rights, kala movie, kala film, kala review

Related Post