మూవీ నిర్మాణానికి అడ్డంకులు

news02 June 29, 2018, 11:06 a.m. entertainment

ntr bio pic

హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత కథా నేపథ్యం ఆధారంగా ఆయ‌న‌ బయోపిక్ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రగా...క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈమూవీ తెరకెక్కనుంది. అయితే బయోపిక్ ఎన్టీఆర్‌ది కావడంతో..ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, తెలుగు దేశం పార్టీ నాయకులు సినిమా కోసం ఎదురు చూస్తూ...గంపెడాశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ...ఈసినిమా విడుద‌లైతే ప్రజల్లో తెలుగు దేశం పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. 

ntr

ఐతే ఇంత వరకూ బాగానే ఉన్నా...అప్పుడే ఎన్టీఆర్ బయోపిక్‌కు కష్టాలు మొదలవ్వ‌డం విశేషం. ఎన్టీఆర్ మూవీలో అభ్యంతరకర సన్ని శాలున్నాయని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుటుంబ సభ్యులు కోర్టుకెక్కారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను తీసే ముందు తమను కనీసం సంప్రదించలేదని... ఈ సినిమాలో తమ కుటుంబ సభ్యులను, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును నెగటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అందుకే ఈసినిమాను వెంటనే నిలుపుదల చేయాలని కోర్టు ద్వారా హీరో బాలకృష్ణకు...నటుడు హోదాలో ఒక్కటి, ఎమ్మెల్యే హోదాలో మరొక  నోటీసులను పంపించారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్‌కు కూడా లీగల్ నోటీసులు పంపించారు. తమకు సంబంధించిన‌ అంశాలతో సినిమా నిర్మాణం ఆధారపడి ఉన్నందునా...వెంటనే మూవీ నిర్మాణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు.

tdp

దీంతో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేత‌ల ఆశ‌ల‌పై నీళ్లు చల్లిన‌ట్లైంది. నాదెండ్ల కుటుంబీకులు కోర్టుకెక్క‌డంపై వారు తెగ బాధ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాదే ఉన్నంద‌నా...అప్ప‌టి లోగా ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌స్తే...ప్ర‌జ‌ల్లో టీడీపీకి సానుకూల‌త పెరుగుతుంద‌ని భావించారు. ఎన్టీఆర్‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ‌ను ఎల‌క్ష‌న్ స‌మ‌యానికి ఆయ‌న బ‌యోపిక్ రూపంలో క్యాష్ చేసుకోవాల‌నుకున్నారు. అయితే తాజాగా నాదెండ్ల కుటుంబీకులు కోర్టు ఎక్క‌డంతో మొత్తం పరిస్థితి మొద‌టికి వ‌చ్చిన‌ట్లైంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల నాటికి ఈమూవీ రిలీజ్ అవుతేనే బాగుంటుంద‌ని...లేక‌పోతే త‌ర్వాత విడుద‌లైన పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని అనుకుంటున్నారు. అప్ప‌టి లోగా ఈలీగ‌ల్  పంచాయితీ ముగిస్తే బాగుండేద‌ని భావిస్తున్నారంటా..! 

nadendla

అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, అస‌లు నెలరాజు ఎవ‌ర‌నేదే క‌దా మీ డౌట్‌...? అదేనండి... మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్‌నే నెల‌రాజుగా పిలుస్తుంటారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు స‌ర్కారును ఫాం చేసేందుకు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్‌కు మించి బ‌ల‌మున్నా...అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ సీఎం ప‌ద‌వి చేప‌ట్టేందుకు ఎన్టీఆర్‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా...నాదెండ్ల‌కు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు చాన్స్ ఇచ్చారు. దీంతో ఆగ్ర‌హించిన ఎన్టీఆర్ త‌నకు మ‌ద్ద‌తు ఇస్తున్న ఎమ్మెల్యేల‌తో ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ ముందు ప‌రేడ్ నిర్వ‌హించారు. ఫ‌లితంగా విధి లేని ప‌రిస్థితిలో తిరిగి నాదెండ్ల నెల‌రోజుల‌కే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది.  అందుకే నాదెండ్ల‌ నెల‌రోజులు సీఎంగా ఉన్నందునా...ఆయ‌న‌ను నెల‌రాజుగా పిలువ‌డం ప‌రిపాటి. అయితే తాజాగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్నందునా...నాదెండ్ల‌ను నెగ‌టివ్‌గా  చూపిస్తున్నార‌ని ఆయ‌న కుటుంబీకులు కోర్టుకెక్క‌డం ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకోవ‌డం విశేషం. సో చూడాలి మ‌రి...ఈనెల‌రాజు గండం నుంచి బాల‌కృష్ణ ఎలా బ‌య‌ట‌ప‌డుతాడో, టీడీపీ నాయ‌కుల ఆశ‌లు నెర‌వేరుతాయో...లేదో అనేది...వెయిట్ అండ్ సీ.

tags: controversi on ntr bio pic,ex cm ntr,ex cm nadenla,nadendla family,court,hero balakrishna,ntr biopic,ntr biopic movie,ntr biopic director,ntr biopic wiki,ntr biopic poster,ntr biopic movie director,ntr biopic images,ntr biopic producer,ntr biopic trailer,ntr biopic krish,ntr biopic movie wiki,ntr biopic balakrishna,ntr biopic balayya,ntr biopic by rgv,ntr biopic launch,ntr biopic rgv,ram gopal varma on ntr biopic,ntr biopic song,ntr biopic twitter ntr biopic telugu,ntr biopic updates,ntr biopic video,ntr biopic wikipedia,ntr biopic youtube

Related Post