చెల్లి కానుకకు అన్నయ్య ఆనందం..

news02 Oct. 22, 2018, 11:01 p.m. entertainment

ntr

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాత రికార్డులన్నింటినీ తుడిపేస్తోంది. ప్రధానంగా అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం అంటున్నారు అంతా. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ సతీమణీ నారా బ్రాహ్మణికి అరవింద సమేత వీర రాఘవ సినిమా తెగ నచ్చేసిందట. అందులోను అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ నటన ఆమెను బాగా ఆకట్టుకుంది. దీంతో ఏన్టీఆర్ పై బ్రాహ్మణి ప్రశంసల జల్లు కురిపించింది. 

bramhani

ఇక దసరా సందర్భంగా తన అన్న జూనియర్ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను కూడా పంపించింది నారా బ్రాహ్మణి. ఈ మధ్య రోడ్డుప్రమాదంలో చనిపోయిన ఎన్టీఆర్ తండ్రి.. తన పెదనాన్న హరికృష్ణ పాత ఫోటోలను సేకరించి వాటిని ఆల్బమ్‌గా తయారు చేసి తన అన్న ఎన్టీఆర్‌కి కానుకగా పంపింది బ్రాహ్మణి. ఇంకేముంది తన చెల్లి నారా బ్రాహ్మణి పంపిన ఆల్బమ్ ను చూసిన ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ అరుదైన ఫోటోలను చూసి ఉద్వేగానికి లోనయ్యాడట. దసరా సందర్భంగా తన తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకునేలా చేసిన తన చెల్లలు నారా బ్రాహ్మణికి జూనియర్ ఎన్టీఆర్ మనస్పూర్తిగా అభినందించారట.  

tags: ntr, jr ntr, bramhani, nara bramhani, bramhani gift to ntr, nara bramhani gift to jr ntr, nara bramhani rare gift to ntr

Related Post