సినిమా బాగుంద‌ని కితాబు

news02 April 25, 2018, 5:26 p.m. entertainment

bharat ane nenu

హైద‌రాబాద్: ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ తో క‌లిసి తెలంగాణ మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.తార‌క‌రావు కాసేపు సంద‌డి చేశారు. అదేనండి  కొర‌టాల శివ‌-సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను మూవీలో సీఎంగా న‌టించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో కేటీఆర్ ముచ్చ‌టించారు. పూర్తి పొటిలిక‌ల్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉన్న సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అభినందించారు. హిరో మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో క‌లిసి  మూవీ చూసి బాగుంద‌ని కితాబిచ్చారు. 


ఎంతో స‌మ‌యం వెచ్చించి మూవీ చూసినందుకు సినిమా యూనిట్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. మూవీ బృందాన్ని కేటీఆర్ ప్ర‌శంసించ‌డం సంతోషంగా ఉంద‌ని చిత్ర యూనిట్ పేర్కొంది.

tags: ktr,maheshbabu,koratalasiva,cinema,movie,bharathanenenu,

Related Post