కంగ్రాట్స్ చిరంజీవి...

news02 April 3, 2018, 11:10 a.m. entertainment

mohan babu about rangastalam

సినిమా పిల్లర్- మెగాహీరో రామ్‌ చరణ్‌ తేజ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే సుమారు 100 కోట్ల రూపాయల వసూళ్లును రాబట్టింది. ఇక రంగస్థలం సినిమాపై చాలా మంది సినీ ప్రముఖులు సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. మరోవైపు తెలుగు సినీరంగంలోని చాలా మంది రికార్డులను రంగస్థలం బద్దలుకొడుతోంది.
ఈ క్రమంలోనే నటుడు మోహన్‌బాబు రంగస్థలం సినిమా గురించి ట్విటర్‌ ద్వారా స్పందించారు. రంగస్థలం గురించి చాలా మంచి విషయాలు వింటున్నానని అన్నారు. రంగస్థలం గురించి మంచి విషయాలు వింటున్నాను. త్వరలో నేనూ సినిమా చూస్తానని మోహన్ బాబు చెప్పారు. రాం చరణ్‌, చిత్రబృందానికి కంగ్రాట్స్‌. పిల్లలు ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణించడం చూసి ఏ తండ్రైనా గర్విస్తాడు. నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవి కూడా అంతే గర్విస్తున్నారని అనుకుంటున్నాను. కంగ్రాట్స్‌ అని ట్వీట్టర్లో స్పందించారు మోహన్ బాబు.
 

Related Post