అసభ్య కామెంట్స్‌,వీడియోలపై కేసులు త‌ప్ప‌వు

news02 May 2, 2018, 3:39 p.m. entertainment

casting couch

హైద‌రాబాద్: కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న న‌టీ శ్రీ‌రెడ్డి బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న‌ను కించ‌ప‌రుస్తూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో అన‌వ‌స‌ర‌మైన పోస్టులు, వీడియోలు పెడుతుండ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టులు పెట్టిన వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌ముఖ లాయ‌ర్ గోపాలకృష్ణ క‌ళానిధితో క‌లిసి మీడియా స‌మావేశంలో పాల్గొన్న ఆమె... సోష‌ల్ మీడియాలో త‌న‌ను ఎవ‌రు ఇబ్బంది క‌ల్గించేలా వ్య‌వ‌హారించిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ఈవిష‌యంలో సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లతాన‌ని హెచ్చ‌రించారు.  పోస్టులు పెట్టిన వారిపై క్రిమిన‌ల్‌, సైబ‌ర్ యాక్ట్ కింద అభియోగాలు న‌మోదు చేయిస్తామ‌ని వెల్ల‌డించారు. 

ఇప్ప‌టికే కొంత మంది త‌న‌ను చ‌ట్ట‌ప‌రంగా వెళ్లి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చుగా అని స‌లహాలు ఇచ్చార‌ని.. అయితే లా ను ఇక ముందు ఏలా వాడాలో చూపిస్తాన‌ని తెలిపారు. మాలాగ లా ను ఏవ‌రూ వాడ‌లేర‌న్నారు. త‌న త‌ర‌పున వాదించ‌డానికి క‌ళానిధితో పాటు నలుగురు లాయర్లు ఉంటార‌ని వెల్ల‌డించారు. ఇందులో ర‌చ‌న‌రెడ్డి, ప‌ట్టాభి ఉంటార‌ని తెలిపారు. 

క్యాష్ క‌మిటీలో వారెందుకు
సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేదుకు ఏర్పాటు చేస్తున్న క‌మిటీలో ప్ర‌ముఖ హీరో ద‌గ్గ‌బాటి రానా, సుప్రియ‌, ప్రియాంక ద‌త్ ఉండ‌టాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో అంగీక‌రించేది లేద‌న్నారు. కొంత మంది వీర‌నారి విభాగం పేరు చెప్పిన త‌న‌పై దాడి చేస్తున్నార‌ని దీన్ని ప‌వ‌న్ ఎందుకు ఖండించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. లా అండ్ ఆర్డ‌ర్ గురించి మాట్లాడుతున్న ప‌వ‌న్...ఆయ‌న అభిమానులు లా అండ్ ఆర్డ‌ర్ పాటించ‌క‌పోతే ఎందుకు స‌ర్ధి చెప్ప‌డం లేద‌ని విమ‌ర్శించారు. 

tags: srireddypressmeet,lawyerkalanidhi,rachanareddy,pattabhi,castingcouch,cinemaindustri

Related Post