చిరంజీవి ఇంట్లో ఈ ఫోటో స్పెషల్

news02 March 27, 2018, 6:53 p.m. entertainment

Megapower ram charan birthday pics

హైదరాబాద్ :రంగస్థలం హిట్ టాక్ తో సంబరాలు చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరో సందడికి తెరలేసింది. మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు పరిశ్రమలో దూసుకుపోతున్న మెగాపవర్ రాంచరణ్ బర్త్ డే ను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంభ సభ్యులంతా ఒకే దగ్గర చేరి రాంచరణ్ చేత కేక్ కట్ చేయించారు. మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొనటం విశేషం. ఈ ఫోటో లను చెర్రీ భార్య ఉపాసన ట్విట్టర్ లో పెట్టింది. తల్లి తండ్రి మధ్య లో చెర్రీ, ఆ పక్కనే పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. చాలా రోజుల తర్వాత మెగా స్టార్, పవర్ స్టార్, చెర్రీ లు కలిసి దిగిన ఫోటో బయటకు రావటంతో మెగా ఫ్యామిలీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇది మెగా ఫ్యామిలీ లో మా మధ్య బందాలంటూ ఉపాసన ట్వీట్ చేసింది. ఈ బర్త్ డే తో రాంచరణ్ 34 వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు.

ramcharan birthday pics

https://twitter.com/upasanakonidela/status/978589656567578625

 

tags: Ramcharan birthday, ramcharan pics, pawankalyan, power star , megastar house, chiranjeevi family, pawan kalyan family, chiranjeevi wife, upasana, ramcharan wife.

Related Post