పాకానపడ్డ దీపికా ప్రేమాయణం..

news02 Oct. 22, 2018, 4:38 p.m. entertainment

Deepika

అందాల భామ దీపికా పదుకొణె ఓ ఇంటిది కాబోతోంది. అందే నండీ దీపిక పెళ్లి చేసుకోబోతోంది. రణ్‌వీర్‌ సింగ్‌తో తనకున్న ప్రేమ బంధం నవంబరు 14, 15వ తేదీల్లో వివాహ బంధంగా మార్చుకోబోతోంది దీపికా. ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వార అభిమానులకు విషయాన్ని పంచుకున్నాకు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నవంబరు 14, 15న మా పెళ్లి జరగబోతోందని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్న దీపికా... ఇన్నేళ్లు మీరు మాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలని చెప్పింది. ప్రేమ, స్నేహం, నమ్మకంతో మేం కలిసి చేయబోతున్న ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని.... ప్రేమతో మీ దీపిక, రణ్‌వీర్‌ అని ట్విట్టర్ లో పేర్కొంది ఈ నెరజాన.

Deepika

ఇక పెళ్లి కొడుకు రణ్‌వీర్‌ కపూర్ కూడా సోషల్ మీడియా ద్వార ఇలాంటి సందేశాన్నే ఇచ్చారు. దీపికా-రణ్ వీర్ పెళ్లి వార్త విన్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన జంట పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక దీపిక పదుకొణే, రణ్‌వీర్ కపూర్ లు కలిసి రామ్‌లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ తదితర సినిమాల్లో నటించారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇదిగో ఇన్నాళ్లకు వీరిద్దరు ఒకటి కాబోతున్నారన్నమాట. మరి వీరిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుదామా..

tags: Deepika, deepika padukone, deepika ranveer marriage, deepika ranveer singh marriage, deepika ranveer wedding

Related Post