లైవ్ లో గన్ పెల్చింది..

news02 Feb. 17, 2018, 11 a.m. entertainment

సినిమా పిల్లర్- తన కనుసైగతోనే దేశవ్యాప్తంగా యువతరం హృదయాలను కొల్లగొట్టి.. అందరిని తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ గురించి ఇప్పుడు తెలియనివారుండరు. కేవలం ఒక్క టీజర్ తో ఈ భామ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ అయిపోయింది. ఒక్కరోజులోనే ప్రియకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. ‘ఒరు అదార్‌ లవ్’‌ చిత్రంలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు అందరినీ మంత్రుముగ్ధుల్ని చేశాయి. 
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌లో ఆమె గన్నుతో మరోసారి హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 
‘ఒరు అదార్‌ లవ్’‌ టీజర్‌ లో ప్రియ ముద్దును గన్‌ లో లోడ్ చేసి ప్రేమికుడికి గురి పెట్టి పేల్చేసిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను ప్రియ లైవ్‌ లో చేసి మరోసారి అభిమానుల్ని అలరించింది. స్టేజ్‌ మీద తెరపై టీజర్‌ వస్తుండగా.. ప్రియ, రోషన్‌ అదే సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందు చేశారు. ఆ తరువాత ఆమె ముద్దును గన్‌ లో మరోసారి లోడ్‌ చేసి ప్రేక్షకులకు గురి పెట్టి పేల్చింది. అంతే అభిమానులంతా మరోసారు ప్రియా కు ఫిదా అయిపోయారు.

Related Post