ఆమె అంటే అంత భయం ఎందుకు..

news02 Sept. 25, 2018, 8:16 a.m. entertainment

devdas

అక్కినేని నాగార్జున ఎవ్వరికి భయపడట.. కానీ ఆమెను చూస్తే మాత్రం వణికిపోతాడట.. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా.. కొంపదీసి నాగార్జున భార్య అక్కినేని అమల అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. నాగార్జున తాజాగా నటిస్తున్న సినిమా దేవదాస్ లో ఆయన ప్రేమించిన హీరోయిన్ అంటే చాలా భయమట. అదన్న మాట సంగతి. 

devdas

దేవదాస్ లో నాగార్జున డాన్ పాత్ర పోషిస్టున్నారు. ఐతే ఈ పాత్ర అంత సీరియస్ ఉన్న పాత్ర కాదట. హీరో నానితో కలిసి నాగార్జున చేస్తున్న ఈ సినిమాలో కొంత కామెడీగా ఉన్న డాన్ పాత్రలో నాగ్ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే టీవీ యాంకర్ గా పనిచేస్తున్న హీరోయిన్ ను ప్రేమిస్తాడు నాగార్జున. ఆమె అంటే నాగ్ కు చాలా భయమట. 

devdas

ఇక ఈ కాలంలో సెల్ ఫోన్ ల పిచ్చి చూస్తోంటే నాగార్జునకు కోపం వస్తోందట. ఎప్పుడు చూసినా అందరు సెల్ ఫోన్ లో లీనమైపోతారని.. అది తనకు నచ్చదని చెబుతు్ననారు. ఐతే నాగచైతన్యకు, అఖిల్ కు మాత్రం సెల్ ఫోన్ పిచ్చి లేదని చెప్పారు నాగార్జున. ఐతే హీరో నానికి కూడా బాగా సెల్ ఫోన్ పిచ్చి ఉందని.. నిద్రలో కూడా సెల్ ఫోన్ పట్టుకుని పడుకుంటాడని సరదాగా చెప్పారు నాగ్. ఇక నాగార్జున ప్రేమించిన టీవీ యాంకర్ గా అందాల భామ ఆకాంక్ష సింగ్ నటిస్తోంది.

 

tags: devdas, nagarjuna devdas, devdas movie, nani nagarjuna devdas, akanksha singh, aksnksha singh in devdas, rashmika in devdas, nagarjuna about devdas

Related Post