మరీ అంత అతి అవసరమా..

news02 June 13, 2018, 2:31 p.m. entertainment

keerthi

సినిమా పిల్లర్- మహానటి సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది అందాల భామ కీర్తి సురేష్. మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిందని.. సావిత్రిని మైమరిపించేలా జీవించిందని అంతా ప్రశంసిస్తున్నారు. ఇదిగో ఇటివంటి సమయంలో తమిళ హీరో విజయ్ అభిమానులు కీర్తీ సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా కీర్తిని పొగుడుతుంటే.. వాళ్లెందుకు విమర్శిస్తున్నారని అనుకుంటున్నారా.. అసలేం జరిగిందో చూడండి... 

vijay

తమిళ హీరో విజయ్‌, కీర్తి సురేష్ జంటగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. షూటింగ్ లొకేషన్ లోని ఓ ఫొటోలో కీర్తి సురేశ్‌ సోఫాపై కూర్చేగా.. హీరో విజయ్‌ మాత్రం క్రింద కూర్చున్నారు. అటు సెలబ్రిటీ స్టైలిస్ట్‌ సమంత జగన్‌ వారిద్దరితో ఏదో మాట్లాడుతున్నట్లు కన్పించారు. ‌ఇక ఫోటోలో విజయ్‌ కాలుపై కీర్తీ సురేష్ కాలు పెట్టి ఉంది.  

vija keerthi

ఈ ఫోటోలో ఏం తప్పు కన్పించిందో ఏమోగాని విజయ్ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. కీర్తీ సురేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా హీరోను క్రింద కూర్చోబెట్టి.. నీవు సోఫాపై కూర్చుంటావా అని విమర్శిస్తున్నారు. ఐైతే దీనిపై హీరో విజయ్ మాత్రం ఇంకా స్పందించలేదు. షూటింగ్ లొకేషన్ లో ఇలా సరదాగా రిలాక్స్ అయి మాట్లాడుకోవడం ఎక్కడైనా కామనే. మరీ ఇలా అభిమానులు ప్రతిదీ బూతద్దంలో పెట్టి చూడటం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.

tags: vijay, keerthi, vija keerthi, keerthi suresh, keerthi with vijay, fans fire on keerthi, keerthi with vijay

Related Post