ఓటు హక్కు దుర్వినియోగం..

news02 Oct. 2, 2018, 8:05 a.m. entertainment

nota

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ నటించిన సినిమా నోటా. త్వరలోనే విడుదలకు సిద్దమైన ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాడు సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి. తెలుగు తమిళ బాషల్లో ఈనెల 5న విడుదల అవుతున్న నోటా సినిమా తెలంగాణలోని ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని జగదీశ్వర్ రెడ్డి వాదిస్తున్నారు. 

nota

ఈ సినిమా చూసిన ఓటర్లు.. రాజ్యాంగ బద్దంగా ఉపయోగించుకోవాల్సిన ఓటు హక్కు పక్కదారి పడుతుందని ఈయన అనుమానం. ఎందుకంటే చాలా మంది ఎవరో ఒకరికి ఓటు వేయాల్సింది పోయి.. నోటా ఆప్షన్ ను ఎంచుకుంటే.. ఓటు దుర్వినియోగం అవుతుందని అంటున్నాడు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాడు జగదీశ్వర్ రెడ్డి. 

nota

మరి ఎన్నికల సంఘం నోటా సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకుంటుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నట్లు నోటా సినిమాలో విజయ్ దేవరకొండకు జంటగా అందాల భామ మోహ్రీన్ నటిస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

tags: nota, nota movie, nota telugu movie, nota film, note telugu film, compliant to ec about nota movie

Related Post