అదిరిపోయిన మెహబూబా ట్రైలర్..

news02 April 9, 2018, 9:05 p.m. entertainment

mehabooba trailer

సినిమా పిల్లర్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఆయన తనయుడు హీరోగా తెరకెక్కుతున్న ‘మెహబూబా’ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్‌‌లో యుద్ధ సన్నివేశాలను చూపిస్తూ ‘దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో ఓ చిన్న స్థానం దొరికినా చాలు అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది, ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ మళ్లీ పుడతాం’ లాంటి డైలాగ్ సైతం బాగా ఆకట్టుకుంటోంది. 

పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై రూపొందిన ఈ సినిమా 1971 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ విడుదలైన 2 గంటల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో పూరి కనెక్ట్స్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే చార్మీ.. చాలా ఎమోషన్‌కి లోనవుతూ ఓ ట్వీట్ చేసింది. 2 గంటల్లోనే 5 లక్షల వ్యూస్ అనే పోస్టర్ పెట్టి ‘మాటల్లేవ్.. ఆనంద భాష్పాలే’ అని టాగ్ చేసింది. ఛార్మి పెట్టిన ఈ ట్వీట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

tags: mehabooba, mehabooba movie, mehabooba trailer, mehabooba first look

Related Post