ఆశ్చర్యపోయిన చందమామ

news02 Jan. 27, 2019, 6:38 a.m. entertainment

seetha

బెల్లంకొండ శ్రీనివాస్‌.. అందాల చందమామ కాజల్‌ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా సీత. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. బెల్లంకొండ శ్రీనివాస్ సంతోషంతో అరుస్తుంటే.. అతన్ని కాజల్‌  అగర్వాల్ ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ లో ఉంది. ఈ పోస్టర్‌ను ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. సీత.. రామతో కలిసి పిచ్చి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండని కామెంట్ కూడా పెట్టింది కాజల్. అన్నట్లు ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ చేస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. 

tags: seetha, seetha poster, seetha first look, seetha movie poster, bellamkonda seetha, kajal seetha movie, kajal as a seetha

Related Post