రంగస్థలం పై రాంగోపాల్ వర్మ..

news02 April 3, 2018, 6:15 p.m. entertainment

ramgopal varma on rangastalam

సినిమా పిల్లర్- ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రాంచరణ్ రంగస్థలం సినిమాపై మాత్రం పాజిటివ్ గా స్పందించారు. రంగస్థలంలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించారని రామ్‌గోపాల్‌ వర్మ మెచ్చుకున్నారు. రంగస్థలం సినిమా చూసిన వర్మ ట్విటర్‌ ద్వార స్పందించారు. 

రంగస్థలం సినిమా చక్కటి విజయం సాధించిందని రాంగోపాల్ వర్మ అన్నారు. ఇక రామ్‌ చరణ్‌ మైండ్‌ బ్లోయింగ్‌, అద్భుతం.. హే సుకుమార్ ఇదిగో నీకు నా మూడు నమస్కారాలు (ఎమోజీలు) .. మూడు ముద్దులు (ఎమోజీలు) అని వర్మ ట్వీట్టర్లో తనదైన శైళిలో స్పందించారు. ఎప్పటిలాగే ఎవో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా వర్మ మెచ్చుకోవడంతో అటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాంగోపాల్ వర్మతోపాటు అందాల భామ రకుల్‌ప్రీత్ సింగ్‌ కూడా రంగస్థలంపై ట్వీట్‌ చేసింది. మనకు నచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి... మీరు అద్భుతంగా అనుకునే సినిమా రంగస్థలం చాలా నచ్చిందని రకుల్ పేర్కొంది. రంగస్థలం లోకి మమ్మల్ని తీసుకెళ్లినందుకు సుకుమార్ కు ధన్యవాదాలు అని చెప్పింది. చిట్టిబాబు, రామలక్ష్మి ఎంత అద్భుతంగా ఉన్నారో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఎంత చక్కటి అనుభూతి సమంత అని రకుల్‌ ప్రీత్ సింగ్ ట్వీట్టర్లో స్పందించింది.

Related Post