సాహసమే అంటున్న అభిమానులు

news02 Jan. 9, 2019, 8:01 a.m. entertainment

kajal

అందాల చందమామ కాజల్ అగర్వాల్ మొట్టమొదటి సారి ప్రతినాయకురాలి పాత్ర పోషిస్తోంది. కాజల్ ప్రధాన పాత్రలో ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఐతే ఈ సినిమాలో కాజల్‌ ప్రతినాయకురాలి ఛాయలున్న సీత అనే పాత్రలో కనిపించబోతోందట. 

kajal

ఈ పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మ చాలా కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది. కాజల్ నటన విషయంలో దర్శక, నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇది నటి ప్రాధాన్యం ఉన్న సినిమాగా తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా గ్లామరస్ హీరోయిన్ గా అలరించిన కాజల్‌ ఇలాంటి పాత్రలో నటిస్తూ.. సాహసం చేస్తున్నారని ఆమె అభిమానలు అంటున్నారు. 
 

tags: kajal, kajal agarwal, kajal as a vilan, kajal agarwal aas a vilan, kajal hot, kajal agarwal hot, kajal movies

Related Post