దేవదాస్ సినిమా రివ్యూ

news02 Sept. 27, 2018, 4:16 p.m. entertainment

దేవదాస్

అక్కినేని నాగార్జున, హీరో నాని కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్ రివ్యూ ప్రత్యేకంగా మీకోసం..

సినమా- దేవదాస్‌ తారాగణం- అక్కినేని నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్న, కునాల్‌ కపూర్‌, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ తదితరులు మ్యూజిక్ - మణిశర్మ నిర్మాత- అశ్వనీదత్‌ దర్శకత్వం- శ్రీరామ్‌ ఆదిత్య

న్యూస్ పిల్లర్ రేటింగ్.. 3/5

పరిచయం....

బాలూవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ మన తెలుగులో మాత్రం మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఐతే ఈమధ్య కాలంలో తెలుగులోను మల్టీస్టారర్ సినిమాలు బాగానే వస్తుననాయి. ఇదిగో ఇప్పుడు అక్కినేని నాగార్జున, హీరో నాని కలిసి నటించిన సినిమానే దేవదాస్. తన తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన బ్లాక్ బాస్టర్ మూవి దేవదాస్ టౌటిల్ లో నటించడం పట్ల నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. మరింకెందుకు ఆలస్యం.. దేవదాస్ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

దేవదాస్

దేవదాస్ సినమా కధ..

ఇక కధలోకి వెళ్తే.. దేవ (నాగార్జున) ఓ పెద్ద డాన్. తనను పెంచి పోషించిన తండ్రిలాంటి దాదా (శరత్ కుమార్) ను ఓ ముఠా దారుణంగా చంపేస్తుంది. దీంతో దాదాను చంపిన వారికోసం దేవ హైదరాబాద్ వస్తాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు దేవను పట్టుకునేందుకు చేసే ప్రయత్నంలో కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో గాయపడ్డ దేవ.. వారి నుంచి తప్పంచుకుని వైద్యం కోసం దాస్ (నాని దగ్గరకు వెళ్తాడు). కాల్పుల్లో గాయపడ్డ దేవను దాస్ కాపాడి.. వైద్యం చేస్తాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి.. అది స్నేహంగా బలపడుతుంది. మరి అమాయకుడైన దాస్.. డాన్ అయిన దేవ వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. దేవ, దాస్ ల లవ్ స్టోరీ ఎంటీ, వీరిద్దరిలో ఎవరు వల్ల ఎవరు ప్రబావితం అయ్యారు.. ఎవరిని ఎవరు మార్చారన్నదే దేవదాస్ అసలు కధ.

దేవదాస్ ఎలా ఉందంటే..

అక్కినేని నాగార్జున.. హీరో నాని లు కలిసి నటించడం వీరిరువురి అభిమానులకు పండగలా ఉంది. ఇటి నాగార్జున.. అటు నాని నుంచి వారి వారి అభిమానులు ఏం ఆశించి సినిమాకు వస్తారో అవన్నీ సినిమాలో పొందుపరిచాడు దర్శకుడు. కధ విషయానికి వస్తే మామూలే కధే అని చెప్పవచ్చు. దేవదాస్ అంటే సాధారనంగా ప్రేమలో విఫలమైనవాడి కధ అనుకుంటాం కధా. ఐతే ఈ సినిమాలో మాత్రం ఓ పెద్ద డాన్.. ఓ మామూలు డాక్టర్ స్నేహితులైతే.. వారి మధ్య బంధం ఎలా ఉంటుంది.. డాన్ కు ఉన్న ప్రేమాయణానికి డాక్టర్ ఎలా సంహకరించాడు.. ఈ క్రమంలో వచ్చే ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి.

దేవదాస్

ఇక దేవదాస్ సినిమా మొదలు కాగానే కాస్త సీరియస్ గా సాగుతుంది. అసలు దేవ ఎవరు.. ఆతని బ్యాక్ గ్రౌండ్ ఎంటీ.. ఎలా ఎంట్రీ ఇస్తాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. అదే డాక్టర్ దాస్ ఎంట్రీ ఐతే మంచి కామెడీగా ఉంటుందనుకొండి. అంతే కాదు దేవ, దాస్ లు కలిసినప్పుడు ఇంకా సరదాగా ఉంటుందని చెప్పవచ్చు. అసలు సినిమా అంతా నాగార్జున, నానిల మధ్య ఉండే సన్నివేశాలే కీలకం.. ప్రధానం అని వేరే చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య సన్నివేశాల్లో కొన్ని నవ్విస్తే.. మరి కొన్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక ఇంటర్వేల్ తరువాత అప్పటి వరకు సరదాగా సాగిన కధ కాస్త సీరియస్ గా మారుతుంది. ఇక్కడ అవయవదానానికి సంబందించిన కొన్ని సన్నివేశాలు మరీ సీరియస్ గా అనిపిస్తాయి. అంతకు ముందు సరదాగా ఉన్న కధే బావుందని అనిపించకమానదు. ఐతే కధలో ఇదీ భాగమే కనుక చూడక తప్పదనుకొండి. ఐతే మళ్లీ క్లైమాక్స్ రాగానే మంచి సరదా కనిపిస్తుంది. దేవ, దాస్ ల మధ్య సెంటిమెంట్ తో కూడిన కామెడీ బాగా అలరిస్తుంది.

దేవదాస్

విశ్లేషణ..

దేవదాస్ సినిమాకు అక్కినేని నాగార్జున, నానిలే ప్రాణం అని చెప్పవచ్చు. ఇద్దరూ పోటీ పడీ మరీ నటించి.. ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాగార్జున లుక్ ఈ సినిమాలో గత సినిమాల్లో కంటే బావుందనిపించింది. ఇక నాని కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. మంచి ఫెర్ఫామెన్స్ కనబరిచాడు. నాగార్జున, నాని మధ్య కెమిష్ట్రీ బాగా పండింది. వీరిద్దర మధ్య వచ్చే సన్నీవేశాలే సినిమా అంతా నడిపిస్తాయి. ఇక ఈ సినిమాలో నటించిన రష్మికా, ఆకాంక్ష లు కేవలం పాటల కోసం తప్పితే వారికి నటించే చాన్స్ పెద్దగా రాలేదని చెప్పాలి. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నా వారి వారి పాత్రల నిడివి చాలా తక్కువ. ఇక దేవదాస్ లో కేవలం రెండు పాటలు మాత్రమే వినసొంపుగా ఉన్నాయనిపిస్తోంది. మొత్తానికి ఒకసారి సరదాగా సినిమా చూడాలనిపిస్తే మాత్రం దేవదాస్ చూడవచ్చు.

నోట్.. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: దేవదాస్, నాగార్జున దేవదాస్, దేవదాస్ రివ్యూ, devdas, devdas review, devdas movie review, devdas rating, devas movie rating, devdas film review,

Related Post