పేళ్లి చేసుకుంటే మరి వాళ్లు?

news02 May 2, 2019, 9:08 p.m. entertainment

sai pallavi

సాధారనంగా హీరోయిన్స్ ను పెళ్లెప్పుడని అడిగితే.. అప్పుడే పెళ్లేంటి.. ముందు కెరీర్ ముఖ్యమనో.. లేక తనకు సరైన జోడీ దొరకాలనో చెబుతుంటారు. కానీ లక్షలాది మందిని ఫిదా చేసిన అందాల భామ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా సమాధానం చెబుతోంది. అసలు పెళ్లే చేసుకోనని అందరికి షాక్ ఇచ్చింది సాయి పల్లవి. తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. నాకు నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉందని తెప్పిన నెరజాన.. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉందంటోంది. పెళ్లి జరిగితే అనుకున్నట్లు వారి బాగోగులు చూసుకోలేనన్న సాయి పల్లవి..  జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది.  ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందులో ఆమె హావభావాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఈ భామ ప్రస్తుతం ఎన్జీకే సినిమాలో నటిస్తోంది. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో హీరోయిన్.

tags: sai pallavi, sai pallavi hot, sai pallavi in saree, sai pallavi movies, sai pallavi news, sai pallavi about marriage, sai pallavi marriage

Related Post