ఎన్టీఆర్ స్వహస్తాలతో రాసిన లేఖ..

news02 July 5, 2018, 8:33 p.m. entertainment

ntr

సినిమా పిల్లర్- విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. తెలుగు వారి గుండెచప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ముందు దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తాడనుకున్నా.. ముహూర్తం తరువాత ఏమైందో తెలియదు కాని ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకున్నాడు. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.

ntr biopic

ఇక ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 1975వ సంత్వత్సరంలో తన అభిమానుల్ని ఉద్దేశించి స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వహస్తాలతో రాసిన లేఖను పొందుపరిచిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ యంగ్ లుక్ లో బాలకృష్ణ అభిమానులకు కనువిందు చేశారు. మరోవైపు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా.. తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో వివిధ పాత్రల్లో అలరించబోతున్నారు. ఇక తెలుగు చిత్రసీమలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. అటు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9వ తేదీన సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

tags: ntr, ntr biopic, ntr movie, ntr movie first look, ntr biopic first look, ntr movie teaser, ntr biopic teaser, vidyabalan in ntr movie, balakrishna as a ntr

Related Post