హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న నాని

news02 June 4, 2018, 4:15 p.m. entertainment

big boss-2
హైద‌రాబాద్: తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను బిగ్‌బాస్ రియాల్టీ షో ఎంతగా అల‌రించిందో అంద‌రికీ తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈషో ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకుంది.  తెలుగు సినీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో స్టార్ డ‌మ్ క‌ల్గిన ఎన్టీఆర్ ఈకార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో చాలా పాపుల‌రైంది. అయితే బిగ్‌బాస్ మొద‌టి షోకు హోస్ట్‌గా ఉన్న ఎన్టీఆర్...ప్ర‌స్తుతం ఈషో నుంచి స్వ‌త‌హాగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. దీంతో స్టార్ మా ఈసారి 'బిగ్‌బాస్ -2 షోకు కొత్త హోస్ట్‌ను తెర‌పైకి తెచ్చింది. 

big boss

ఈసారి బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోలో న్యాచురల్ స్టార్ నాని హోస్గ్‌గా వ్యవహరించబోతున్నాడు. మాములుగా సినిమాల్లో సింప్లీ సిటీకి నిద‌ర్శంగా క‌నిపించే నాని...ఈసారి బిగ్‌బాస్-2 షోతో బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు. వైవిధ్యభ‌రిత‌మైన క‌థ‌,క‌థ‌నాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్న విధంగానే న్యాచుర‌ల్ స్టార్ ఈషో ద్వారా సంద‌డి చేయ‌నున్నారు. అయితే ఎన్టీఆర్ ప్లేస్‌ను భ‌ర్తీ చేయ‌డంలో... నాని ఎలాంటీ రోల్‌ను పోషిస్తాడ‌నేదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 

big boss 4

అయితే బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోపై మాట్లాడిన నాని మాత్రం ఇది నాకు కొత్త స‌వాలేనంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను బిగ్‌బాస్ తొలి సీజ‌న్ షో కూడా చూడ‌లేదంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ క‌న్నా... గొప్ప‌గా న‌టించే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తోన్నాడు. బుల్లి తెర ప్రేక్ష‌కులు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా త‌న రోల్ పోషించేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెబుతున్నాడు. 

big boss-2 actors

అయితే జూన్ 10 నుంచి ప్రారంభ‌మైయ్యే ఈషోలో మొత్తం 16 మంది సెల‌బ్రీటీలు పాల్గొనున్న‌ట్లు తెలుస్తోంది. వారిలో హీరో రాజ్ త‌రుణ్‌, సింగ‌ర్ గీతామాధురి, యాంక‌ర్ శ్యామ‌ల‌, యాంక‌ర్ లాస్య‌, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మీ, న‌టుడు ధాన్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీ‌దేవి, హీరోయిన్ గ‌జ‌ల‌,చాందినీ చౌద‌రి, శ్రీ‌రెడ్డి, వ‌రుణ్ సందేశ్‌, త‌నీష్‌, వివా హ‌ర్ష, హ‌స్య న‌టుడు వేణు, ఆర్య‌న్ రాజేష్ పేర్లు వినిపిస్తోన్నాయి. ఇప్పుడు ఇవే పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎంత మంది బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోలో పాల్గొంటార‌నేది షో ప్రారంభ‌మైన త‌ర్వాత మాత్రమే తెలియ‌నుంది. అలాగే బిగ్‌బాస్‌-2 షో వివ‌రాల‌ను స్టార్ మా ఇప్ప‌టికే వెల్ల‌డించింది.  సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు  షో ప్ర‌సారం కానున్న‌ట్లు తెలిపింది. 

tags: bigboss-2,ntr,heronani,natural star, telugu heros,big boss 2 ,telugu big boss 2, telugu contestants big boss 2, telugu start date ,big boss 2 telugu, host telugu bigg boss 2, participants big boss, telugu 2nd september, big boss telugu 2 season ,big boss telugu 2 episode ,big boss season 2 telugu contestants, big boss telugu sep 2, big boss telugu august 2 , big boss telugu aug 2 ,telugu bigg boss 2 contestants ,big boss telugu contestants, big boss telugu season 2 contestants ,big boss 2 telugu date ,big boss season 2 telugu date, big boss telugu day 2 ,bigg boss season 2 telugu starting date ,bigg boss telugu promo 2 download , big boss telugu season 2 release date big boss telugu full episode , big boss telugu episode 2 part 3 , big boss show telugu episode 2 ,big boss telugu episode 2 watch online, big boss telugu episode 2 ,full telugu bigg boss episode 2 online, big boss telugu season 2 episode 1 ,big boss telugu episode 19 , watch bigg boss telugu episode, big boss telugu episo

Related Post