మహేష్ మూవీ ఫంక్షన్ కు ఎన్టీఆర్..

news02 April 7, 2018, 8:15 a.m. entertainment

bharath ane nenu

సినిమా పిల్లర్- ప్రిన్స్ మహేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. భరత్ అనే నేను మూవీ ప్రీరిలీజ్‌ వేడుకను శనివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘భరత్‌ బహిరంగ సభకు ప్రేమతో ఎన్టీఆర్‌’ అంటూ పోస్టర్‌ విడుదల చేసింది. మహేశ్‌ బాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌ రాక కార్యక్రమానికి మరింత జోష్‌ను పెంచనుంది.

saira adwani

ఇక బాలీవుడ్‌ అందాల భామ కైరా అడ్వాణీ ‘భరత్‌ అనే నేను’లో కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల వరుసగా విడుదల చేసిన ఈ చిత్రంలోని మూడు పాటలకు మంచి స్పందన లభించింది. ‘భరత్‌ విజన్‌’ అంటూ విడుదలైన టీజర్‌ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇది‌ యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్‌ చేసిన టీజర్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్‌ 20న భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

tags: bharath ane nenu, mahesh babu movie, saira adwani, kaira adwani, jr ntr, bharath ane neu pre release

Related Post