రాంగోపాల్ వ‌ర్మ ప‌వ‌న్‌పై మ‌రోసారి సెటైర్లు

news02 May 14, 2018, 4:07 p.m. entertainment

VARMA 6

హైద‌రాబాద్: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌రోసారి జ‌ననేన‌ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేశారు. వ‌ర్మ ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్‌పై సెటైర్లు వేశారు. తిరుమలకు కాలినడకన వెళుతూ..అల‌సిపోయి సేద తీరుతున్న ఫోటోల‌ను ఆయ‌న ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ఎన‌ర్జీ ఇదేనా..! అని వంగ్యాస్త్రాలు సంధించారు. "పవర్ స్టార్ పవర్‌ర్‌ర్‌.. ఫుల్ ఎనర్జీకి ఇది పవర్ ఫుల్ ఎగ్జాంపుల్" అని విమ‌ర్శించారు.

varma 2
వ‌ర్మ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేయ‌డంపై ఆయ‌న అభిమానులు మండిప‌డుతున్నారు. సెటైర్లు వేయ‌డం మానుకోవాల‌ని హెచ్చ‌రించారు.  దీనిపై ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా స్పందించారు. ఆయ‌న తన ట్విట్టర్ ఖాతాలో వర్మకు కౌంటర్ ఇచ్చారు. "కెలకమాకు సామీ అంటూ పోస్టు పెట్టారు. కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరని సెటైర్లు వేశారు. మీ హుందాకు త‌గిన‌ట్లు న‌డిచుకోవాల‌ని సూచించారు. ఏమ‌న్న ఉంటే ప‌ర్స‌న‌ల్‌గా ఫోన్ చేసుకుని మాట్లాడుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్టులు వైర‌ల్‌గా మారాయి. 

tags: pavan,varma,jogaiahshastri,

Related Post