ఒక్కసారిగా దగ్గరకు..

news02 Oct. 21, 2018, 8:19 a.m. entertainment

sruthi

దేశవ్యాప్తంగా ఇప్పుడు మీటూ ఉద్యమం ఉదృతం అవుతోంది. ప్రధానంగా సినీ పరిశ్రమ నుంచి గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారంతా ఇప్పుడు బయటపడుతున్నారు. ఒక్కొక్కరు తమ అనుభవాల గురించి పెదవి విప్పుతున్నారు. తాజాగా కన్నడ నటి శ్రుతి హరిహరణ్ సీనియర్ నటుడు అర్జున్ పై ఆరోపణలు చేసింది. అర్జున్ తనతో అసభ్యంహా ప్రవర్తించారని శ్రుతి ఓ భహిరంగ లేఖ రాసింది. అర్జున్ తో కలిసి ఆమె నిబునన్ అనే కన్నడ సినిమాలో నటిచింది. ఈ సినిమా తెలుగులో కురుక్షేత్రం పేరుతో వచ్చింది.

sruthi

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తనపట్ల అర్జున్ అసభ్యంగా ప్రవర్తించారన్నది శ్రుతి ఆరోపణ. చిన్నప్పటి నుంచి అర్జున్ సినిమాలు చూసి పెరిగానని చెప్పిన శ్రుతి హరిహరణ్.. ఆయనతో సినిమా అనగానే ఎగిరి గంతేశానని అంది. ఇక ఓ సారి షూటింగ్ లో రిహార్సల్స్ సమయంలో తనను కౌగిలించుకునే సీన్ ఉండటంతో.. దర్శకుడు చెప్పినట్లు మామూలుగా కౌగిలించుకోకుండా.. ఒక్కసారిగా అర్జును తనను దగ్గరకు లాక్కుని వెన్నునంతా తడిమాడని శ్రుతి చెప్పింది. దీంతో తాను అవాక్కయ్యానని.. ఆ సమయంలో అక్కడం కనీసం 50 మంది ఉంటారని తెలిపింది.

sruthi arjun

అందుకే అర్జున్ ను ఏమీ అనకుండా ప్రొఫెషనల్ గా వ్యవహరించి మౌనంగా ఉన్నానని అంది. ఐతే ఇక ఇప్పుడు పెదవి విప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి.. అర్జున్ గురించి చెప్పాల్సి వచ్చిందని శ్రుతి అంటోంది. ఐతే శ్రుతి ఆరోపణ తనకు షాక్ కలిగించిందన నటుడు అర్జున్ అంటున్నారు. తాను శ్రుతితో రిహార్షల్ చేసే సమయంలో దర్శకుడు సైతం ఉన్నారని ఆయన అంటున్నారు. శ్రుతి ఆరోపణలపై తాను కోర్టును ఆశ్రయిస్తానని అర్జున్ చెప్పారు.

tags: sruthi, sruthi hariharan, sruthi hariharan on arjun, sruthi about arjun, sruthi comments on arjun, sruthi hariharan comments on arjun, nibunan, nibunan movie, sruthi nibunan

Related Post