ఆ అమ్మాయి ఓర చూపుకు ఫిధా ..!

news02 Feb. 12, 2018, 10:49 p.m. entertainment

Valentines_Day_Special_Lady

చెన్నై : ఓ అంద‌మైన అమ్మాయి త‌న ప్రియుడిని ఓర చూపులు చూస్తూ క‌న్ను కొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అమ్మాయి ఎక్స్ప్రెష‌న్స్ కు నెటిజ‌న్లు తెగ ఫిధా అవుతున్నారు. ప్రేమికుల రోజు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రేమికుల‌కు ఈ వీడియో క‌ట్టిప‌డేస్తోంది. 
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంనుకుంటున్నారా .. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్‌ అనే చిత్రంలో కథానాయిక. పేరు ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఈ చిత్రంలోని మాణిక్య మలరయ పూవి అనే పాట ఇటివ‌లే విడుదలైంది. ఆ చిత్రంలో ప్రియ హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది. పక్కనే నిలబడిన తన ప్రియుడిని చూసి ప్రియ కన్ను కొడుతున్న సన్నివేశం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజు రాబోతున్న సందర్భంగా ఈ అమ్మాయి కన్నుకొడుతున్న సన్నివేశాన్ని ఉపయోగించుకొని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా వీక్షించారు.

tags: Valentines Day Special Lady,Valentines Day Special ,Valentines Day , College Girl, Malayalam Movie

Related Post