ఆమె ఎంత అందంగా ఉన్నారో

news02 Dec. 26, 2018, 8:23 a.m. entertainment

sridevi

అందాల దేవత దివంగత శ్రీదేవిని చివరిసారిగా జీరో సినిమాలో చూసిన అభిమానులు చాలా బాధపడిపోతున్నారు. బాలూవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్‌, సల్మాన్ ఖాన్ నటించిన సినిమానే జీరో. అందాల భామలు అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ లు హీరోయిన్లుగా నటించారు. షారుక్‌ మరుగుజ్జు పాత్రలో నటించిన జీరో డిసెంబరు 21న విడుదలైంది. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి అతిథి పాత్రలో నటించింది. శ్రీదేవి మరణం తర్వాత  తెరపై కనపడటం, ఇదే చివరిసారి కావడంతో ఈమె అభిమానులు చాలా ఆవేధన చెందుతున్నారు. కేవలం తమ ఆరాధ్య నటి శ్రీదేవిని చూడటానికే జీరో సినిమాకు వెళ్లినట్లు చాలా మంది అభిమానులు చెప్పారు. 

sridevi

శ్రీదేవిని చివరిసారిగా పెద్ద స్క్రీన్‌పై చూడటానికి సినిమాకు వెళ్లా, శ్రీదేవి ఎంత అందంగా ఉన్నారో, ఆమెను చివరిసారి చూసినప్పుడు మొత్తం థియేటర్‌ మౌనంగా ఉండిపోయిందని అభిమానులు ట్విట్టర్ లో తమ ఆవేధనను పంచుకుంటున్నారు.  అంతే కాదు జీరో సినిమాలో శ్రీదేవి అంచనాలకు మించి ఓ దేవతలా కనిపించారని.. ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోయామని, తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిపోయే తార శ్రీదేవి కోసం మాత్రమే జీరో చూశామని.. ఇలా లక్షలాది మంది అభిమానులు జీరో సినిమా చూశాక తమ మనసులోని భావాలను సోషల్ మీడియాలో వెలిబుచ్చుతున్నారు.

tags: sridevi, sridevi in zero, sridevi in zero movie, sridevi in zero flim, sridevi last movie, sridevi kapoor

Related Post