వేధింపులు తట్టుకోలేక తప్పుకున్నాను..

news02 Sept. 28, 2018, 7:58 a.m. entertainment

thanushree

సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. మిగతా రంగాలకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువే అని చెబుతుంటారు. సినీ పరిశ్రమలో హీరోయిన్స్ నుంచి మొదలు జూనియర్ ఆర్టిస్ట్ ల వరకు సెక్సువల్ హరాస్ మెంట్ ఉంటుందని ఆ రంగం వారే చెబుతారు. ఇదిగో ఈ క్రమంలోనే సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన లైంగింక వేధింపుకు సంబందించిన విషయాన్ని బయటపెట్టింది బాలీవుడ్ సీనియర్ నటి తనూశ్రీ దత్తా.

thanushree

అప్పట్లో 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సందర్బంగా తన సహ నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. ఈ విషయంపై సినిమా యూనిట్ కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. నానా పటేకర్ హరాస్ మెంట్ తట్టుకోలేక ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేసింది తనూశ్రీ. ఆ తరువాత నానా పటేకర్ తన కారుపై దాడి కూడా చేయించాడని.. ఇదిగో ఇన్నాళ్లకు ఈ విషయాన్ని బయటపెట్టే దైర్యం వచ్చిందని చెప్పింది తనూశ్రీ.

tags: thanushree, thanushree datta, thanushree about nanapatekar, thanushree datta on nanapatekar, thanushree fire on nanapatekar, thanushree datta about sexual harrasment

Related Post