మీ ప్రేమకు ధన్యవాదాలు..

news02 April 14, 2018, 10:29 p.m. entertainment

anasuya about fans

సినిమా పిల్లర్-  రాంచరణ్ రంగస్థలం సినిమా విజయోత్సవ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక దర్శకుడు సుకుమార్‌, రామ్‌చరణ్‌, సమంత తదితరులు వేదికపై తమ అనుభూతులను, ఆనందాన్ని పంచుకున్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా అలరించిన హాట్ యాంకర్ అనసూయ మాత్రం వేదికపై మాట్లాడలేదు. ఇంకేముంది ఆమె అభిమానులు కాస్త నిరాశ పడ్డారట. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘కార్యక్రమంలో మీరు ఎందుకు మాట్లాడలేదు ‘రంగమ్మత్త’. నేను బాధపడ్డా’ అని ట్వీట్‌ చేశాడు.

ఇక అభిమాని ట్వీట్ కు స్పందించిన అనసూయ.. నా మాటల కోసం ఎదురుచూసి.. నిరాశ చెందిన వారంతా నన్ను క్షమించాలి. నా గొంతు సరిగా లేదు, నా ఆరోగ్యం కూడా అంతగా బాగాలేదు. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టే తెలుస్తోంది.. అనసూయకు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో. మరోవైపు రంగస్థలం సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుత విజయం సాధించింది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా రెండో వారానికే రూ.150 కోట్ల క్లబ్‌ లో చేరిన సంగతి తెలిసిందే.

Related Post