దేవదాస్ సినిమా సక్సెస్ ను అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇండియాలో కాదు.. అమెరికాలో. ముందు కొత్త జంట అక్కినేని నాగచైతన్య, సమంత అమెరికా వెళ్లగా.. ఆ వెనకాలే అక్కినేని నాగార్జున, అమల, అఖిల్ అమెరికాకు చెక్కేశారు. ఇంకేముంది అక్కడ బాలీడేను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.
అటు సమంత సినిమా యూటర్న్, నాగచైతన్య సినిమా శైలజారెడ్డి అల్లుడు, నాగార్జున సినిమా దేవదాస్.. ఇలా అక్కినేని ఫ్యామిలోలో ఇప్పుడు మూడు సినిమాల విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. ఈ సందర్బంగానే నాగార్జున అభిమానుల కోసం ఓట్వీట్ చేశారు. విజయం అందించిన సువాసనల మధ్య.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హాలీడేస్ ను గడిపితే ఎంతో బావుంటుంది.. అని నాగార్డున ట్వీట్ చేశారు.