కాలా.. కాలిపోవాల్సిందే

news02 June 7, 2018, 9:27 p.m. entertainment

kala

సినిమా పిల్లర్- సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తరువాత నటించిన కాలా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్ తో కబాలి సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్ లోని సినిమా కావడంతో అందరిలోను అంచనాలు పెరిగాయి. మరి ఇంతకీ సినిమా ఎలా ఉందో చూడిండి.....

సినిమా- కాలా

తారాగణం- రజనీకాంత్, నానా పటేకర్ , సముద్ర ఖని, హుమా ఖురేషి, ఈశ్వరి రావు తదితరులు

నిర్మాత- ధనుష్ 

సంగీతం- సంతోష్ నారాయణ్ 

దర్శకత్వం- పా. రంజిత్ 

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2.5/5

 

పరిచయం.....

సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా అంటేనే అభిమానులకు పండగే. ఒక్క తమిళంలోనే కాకుండా.. తెలుగు, కన్నడ, మళయాళి లో కూడా మాంచి క్రేజ్ ఉన్న హీరో రజనీకాంత్. తనదైన స్టైల్, మేనరిజంతో ప్రేక్షకులని అలరించడంలో రజనీ తనకు తానే సాటి. కబాలి తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత అయన హీరోగా నటిస్తున్న సినిమా కాలా. అంతకు ముందు ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కబాలి సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులని నిరాశ పరిచడంతో.. ఇప్పుడు కాలా అయినా ఆయన అభిమానులను మెప్పిస్తుందా అన్నదే ఆసక్తికరం.

kala

ఇక రజినీ కాంత్ కబాలి దర్శకుడు పా రంజిత్ తోనే కాలా సినిమా తీసి అందరికి ఆశ్చర్యపరిచాడు. త్వరలో  రాజకీయంగా ముందుకు సాగాలనుకుంటున్నరజనీకాంత్ కి కాలా హెల్ప్ అవుతుందా.. రెండోసారి రజని పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు పా రంజిత్ నిలబెట్టుకున్నాడా.. అన్నది ముందు ముందు తెలుస్తుంది.

 

కాలా కధ....

ముంబాయి నడిబొడ్డున ఉన్న పేద ప్రజలు తలదాచుకుంటున్న మురికివాడ ధారావి. ఆ మురికివాడకి తిరుగులేని నాయకుడు కరికాలుడు (రజనికాంత్). ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ప్రదేశాన్ని, ప్రజలను కాపాడుతుంటాడు కాలా. కానీ ముంబైలోని రాజకీయ పార్టీ లీడర్ హరిదాస్ (నానా పటేకర్ )ఎన్నో సంవత్సరాల నుంచి ధారవిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అధికారం తన చేతిలోకి రాగానే ప్రజలని మభ్యపెట్టి ధారావికి ఆక్రమించాలని ప్రయత్నాలు టేస్తుంటాడు.

ఐతే  స్థానిక ప్రజలు, వారి నాయకుడు కాలా హరిదాసు కు అడ్డుపడుతుటారు. దాంతో హరిదాస్ కాలతో వైరం పెంచుకుంటాడు. అలా కాలాను టార్గెట్ చేసిన హరిదాస్ అతన్ని ఎలా కష్టపెట్టాడు, వాటన్నింటి ఎదుర్కొని కాలా తన వాళ్ళని, ధారావిని ఎలా కాపాడుకున్నాడు, ఆ పోరాటంలో అతను ఏమి కోల్పోయాడనేదే కాలా సినిమా కధ.

rajini kala

కధలో బలం లేదు....

కాలా సినిమా కధలో ఏ మాత్రం బలం లేదని ఇట్టే అర్దమవుతుంది. అసలు ఫస్ట్ హాఫ్ కు.. సెకండ్ హాఫ్ కు ఏ మాత్రం సంబందం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంనుకుంటున్న రజీనీ కాంత్ ను కాలా కధలో కేవలం ధారావి అనే చిన్న మురికి వాడకు మాత్రమే పరిమితం చేయడం ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదని చెప్పవచ్చు. అందుకే కాలా కధ రజినీ కాంత్ అభిమానుకు కనెక్ట్ కాలేదని చెప్పక తప్పడం లేదు. 

 

రజినీ కాంత్ ఇమేజ్ ను తగ్గించారా..

ఇక కాలా సినిమా ఇన్నాళ్లు సినిమాల్లో రజినీ కాంత్ కు ఉన్న ఇమేజ్ ను తగ్గించారని అనిపిస్తుంది. గత రజినీ సినిమాలను చూస్తే రజినీ స్టైల్.. మేనరిజం ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ కాలా సినిమాలో వాటిని మరింత రేంజ్ కు తీసుకెళ్లాల్సి ఉన్నా.. దాన్ని కొంత తగ్గించారని చెప్పవచ్చు. కాలా లో రజినీ స్టైల్ కోసం ఎన్నో ఊహలతో వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయ్యిందని చెప్పక తప్పడం లేదు. 

 

నటీనటుల ప్రతిభ....

ఇక రజనీకాంత్ భార్యగా ఈశ్వరరావు ఏ మాత్రం సరిపోలేదు. రజనీకాంత్, ఈశ్వరి రావు ల మధ్య వచ్చే సన్నివేశాలు పెద్దగా అలరించలేదు. ఇక కాలా సినిమాలో హీరోయిన్ గా కీలక పాత్రలో నటించిన హుమా ఖురేషీ గ్లామర్ కోసం తప్ప పెద్దగా క్యారెక్టర్ ఏమీలేదు . అంతేకాదు ఇతర పాత్రలో నటించినవారు అంతా తమిళ నటులే కాబట్టి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ కావడం కాస్త కష్టం.

huma kala

దర్శకుడు పా రంజిత్ ప్రేక్షకులని పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా రజనీ కాంత్ కు ఎలివేషన్ సీన్స్ రాయలేకపోయాడన్పిస్తోంది. అంతేకాక ఇంటర్వెల్, ప్రీక్లైమాక్స్ మినహా ఆకట్టుకునే కథనాన్ని, ఎగ్జైట్ చేసే సన్నివేశాలన్నీ కూడా అందించలేకపోయాడు. ఇక కాలాలో పాటలు.. సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. అసలు సినిమాలో పాటలు ఎందుకు వస్తాయే ఎవ్వరికి అర్దం కాదు.

huma qureshi

కబాలి సినిమా తరువాత రజనీ కాంత్ ఇచ్చిన సెకండ్‌ చాన్స్‌ను దర్శకుడు పా.రంజిత్‌ వినియోగించుకోలేకపోయాడని చెప్పవచ్చు. రజనీ కాంత్ నుంచి అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా సినిమాను రూపొందించిన రంజిత్‌ ఫెయిల్ అయ్యాడు. ఇక కాలా సినిమాలో రజనీ ఎంట్రీ విషయంలో కూడా పెద్దగా హడావిడి లేకుండా సాదాసీదాగా కాలా పాత్రను పరిచయం చేయడం ఎవ్వరికి నచ్చలేదు.

tags: kala, rajini kala, kaala, kala review, kala movie, kala movie review, kala film review

Related Post