సినీ కో-ఆర్డినేట‌ర్‌ను చిత‌క‌బాదిన జూనియ‌ర్ ఆర్టిస్టు

news02 May 11, 2018, 12:32 p.m. entertainment

junior artists
హైద‌రాబాద్:పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి అత్యాచారం చేసి మోసం చేసిన ఓ సినీ కో-ఆర్డినేట‌ర్ కు జూనియ‌ర్ ఆర్టిస్టులు స‌రైన బుద్ధి చెప్పారు. పోలీసుల స‌మ‌క్షంలో అంద‌రూ చూస్తుండ‌గానే చెప్పులతో చిత‌క‌బాదారు. మ‌త్తు మందు ఇచ్చి మ‌రీ అత్యాచారానికి పాల్ప‌డ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిందితున్ని క‌ఠినంగా శిక్షించాల‌ని స్టేష‌న్ ముందు ఆందోళ‌న చేశారు. ఆందోళ‌న‌కు దిగిన జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు న‌టీ శ్రీ‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈసంఘ‌ట‌న బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్ ప‌రిధి జ‌రిగింది. 

junior artist

ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం మానేపల్లికి చెందిన శ్రీశాంత్‌రెడ్డి న‌గ‌రంలోని ఇందిరాన‌గ‌ర్ కాల‌నీలో నివాస ముంటూ.. ఇక్క‌డే సినీ కో-ఆర్డినేట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈనేప‌థ్యంలో గ‌తేడాది అక్టోబ‌ర్‌లో శ్రీ‌కాంత్‌రెడ్డికి ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యాన్ని అవ‌కాశంగా తీసుకున్న శ్రీ‌కాంత్‌రెడ్డి... సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని ఆమెను న‌మ్మించాడు.  ఆమె రూంకు వెళ్లి మ‌త్తు మందు ఇచ్చి మ‌రీ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతేకాకుండా ఆమె ఇంట్లోంచి బంగారు ఆభ‌రాలు, డ‌బ్బులు  తీసుకొని అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. 

junior artist 3

అయితే సృహ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత విష‌యం తెలుసుకున్న బాధితురాలు శ్రీ‌కాంత్‌రెడ్డిని పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. దీనికి శ్రీ‌కాంత్‌రెడ్డి నిరాక‌రించ‌డంతో.. ఆందోళ‌న గురైన ఆమె బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.  శ్రీ‌కాంత్‌రెడ్డి కూడా ఆమెపై అదే స‌మ‌యంలో ఫిర్యాదు చేసేందుకు స్టేష‌న్ వ‌చ్చాడు. దీంతో ఆగ్ర‌హించిన అక్క‌డున్న జూనియ‌ర్ ఆర్టిస్టులు ఒక్క‌సారిగా శ్రీ‌కాంత్‌రెడ్డిపై దాడికి దిగారు. అమాయ‌కురాలిని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశావంటూ.. చెప్పుల‌తో చిత‌క‌బాదారు. అయితే వీరికి కాస్తా న‌టీ శ్రీ‌రెడ్డి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో.. విష‌యం పెద్ద‌దైంది. పోలీసు స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ కె.శ్రీ‌నివాస్ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 
 

tags: movie,telugu,sriteddy,juniorartist,banjarahillspolicestation,srikanthreddy

Related Post