వెంకీ మామతో చై అల్లుడు

news02 Feb. 24, 2019, 7:43 a.m. entertainment

venki mama

నిజ జీవితంలో మామా అల్లుళ్లైన హీరో వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య లు తెరపైనా అవే క్యారెక్టర్స్ వేయబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ మామ సినిమాలో  వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు.  ఈ రోజే ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది.  ఇటీవలే విడుదలైన ఎఫ్‌2 సినిమా ఘన విజయాన్ని అందుకొన్న వెంకటేశ్, అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని అల్లుడు నాగచైతన్యతో కలిసి మొదలుపెడుతున్నారు. బలమైన కధ, వినోదం, యాక్షన్‌ అంశాలతో  వెంకీ మామ సినిమా రూపుదిద్దుకొందట. ఇక ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ఆర్‌ఎక్స్‌ 100 భామ పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తుండగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా‌ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ పల్లెటూరి అవతారంలో కనిపించనున్నారని తెలుస్తోంది. సిటీలో పుట్టి పెరిగిన యువకుడిగా నాగచైతన్య సందడి చేస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

tags: venki, venki mama, venki mama movie, venki mama film, venki mama movie shooting, payal in venki mama movie, payal with venkatesh, venki with naga chaitanya

Related Post