విశ్వరూపం-2 రివ్యూ

news02 Aug. 10, 2018, 2:24 p.m. entertainment

vishwaroopam

సినిమా పిల్లర్- కమల్ హాసన్ నిర్మించి.. దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 సినిమా రివ్యూ మీకోసం..
సినిమా- విశ్వరూపం-2
తారాగణం- కమల్‌ హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు.
మ్యూజిక్- మహమ్మద్‌ గిబ్రాన్‌
పాటలు- రామజోగయ్యశాస్త్రి
నిర్మాతలు- ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్
రచన, దర్శకత్వం- కమల్‌హాసన్‌

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2.5/5

పరిచయం.....
విలక్షణ నటుడు క‌మ‌ల్‌హాస‌న్‌ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఆయన ఎంత గొప్ప నటుడో అందరికి తెలిసిందే. నచనలోనే కాదు దర్శకత్వంలో తానేం తీసిపోనని చాలా సినిమాల ద్వార నిరూపించుకున్నారు కమల్ హాసన్. గతంలో ఉగ్రవాదం నేపధ్యంలో తాను తీసిని విశ్వరూపం సినిమాకు సిరీస్ గా ఇప్పుడు విశ్వరూపం-2 సినిమాను తీశారు కమల్ హాసన్. మరిప్పుడు విశ్వరూపం-2 ఎలా ఉందో చూద్దామా... 

kamal

విశ్వరూపం-2 కధ...
ఇక సినిమాలోకి వెళ్తే.. భారతదేశ అత్యున్నత సంస్థ -రా- లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసే విసామ్ అహ్మద్ కశ్మీరి (కమల్ హాసన్) అల్ ఖైదా ఉగ్రవాదుల్లో కలిసి వారి ప్లాన్స్ ను ఎప్పటికప్పుడు సైన్యానికి చేరవేస్తుంటాడు. ఐతే ఓ దశలో కమల్ హాసన్ రా ఏజెంట్ అని అల్ ఖైదాకు తెలిసిపోతుంది. దీంత కమల్ హాసన్ ను చంపేందుకు ఓమర్ ఖురేశి (రాహూల్ బోస్) ప్రణాళికలు సిద్దం చేస్తుంటాడు. అదే సమయంలో భారతదేశంలో సుమారు 64 చోట్ల బాంబు పేళుళ్లకు రంగం సిద్దం చేస్తుంటాడు. ఇక యూకే సముద్రంలో ఉన్న నౌకలోని బాంబులను పేళకుండా.. భారత దేశంలో అల్ ఖైద్ పేల్చాలనుకున్న పేళుళ్లను పేలకుండా కమల్ హాసన్ ఎలా అడ్డుకున్నాడు.. ఓమర్ ఖురేషిని ఎలా ఇంతమొందించాడన్నదే విశ్వరూపం-2 అసలు కధ.

విశ్వరూపం-2 ఎలా ఉందో తెలుసా...
ఇంగ్లండ్ నేప‌థ్యంలో విశ్వరూపం-2 క‌థ ప్రారంభమవుతుంది. ముందుగా కమల్ హాసన్ రా ఏజెంట్ గా ఎలా మారాడు.. ఆతరువాత అల్‌ఖైదా స్థావ‌రాల్లోకి ఎలా వెళ్లాడు.. అక్క‌డ ఏం జ‌రిగింది.. మళ్లీ ఎలా తిరిగొచ్చాడ‌నే విష‌యాలు ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. ఈ క్రమంలోనే యూకేలోనే కమల్ హాసన్ పై హ‌త్యాయ‌త్నం జరగడం... అక్క‌డ తీర్చిదిద్దిన యాక్ష‌న్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే కొన్ని సన్నివశాలు తప్ప కధలో ఏమాత్రం బలం లేదని చెప్పవచ్చు.

puja

రా అధికారులకు, క‌మ‌ల్‌హాస‌న్‌ కు మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు ప్రేక్షకుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. అసలు చెప్ప‌డానికి క‌థేమీ లేక‌పోవ‌డంతో సంభాష‌ణ‌ల‌తో స‌న్నివేశాల్ని సాగ‌దీశారని ఇట్టే అర్దమవుతుంది. ఇఖ సహజంగానే కమల్ హాసన్ నటన అందరిని ఆక‌ట్టుకుంటుంది. క‌మల్ హాసన్ చేసిన యాక్ష‌న్ సన్నివేేశాలు బావున్నాయి అంతే కాదు సమల్ సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. అంతేకాదు అందాల భామలు పూజా కుమార్, ఆండ్రియా అభిన‌యాన్నీ, సినిమాకి కావ‌ల్సిన గ్లామ‌ర్‌నీ అందించారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 

andriya

మొత్తానికి కమల్ హాసన్ నటించి.. దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 సినిమపై ప్రేక్షకుల్లో సహజంగానే భారీ అంచనాలుంటాయి. కానీ కమల్ తన నటన వరకు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నారు కానీ.. కధ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. అందుకే కేవలం కమల్ కోసమైతేనే సినిమాకు వెళ్లాలి.. కధపై ఏ మాత్రం ఆశ పెట్టుకోవద్దునేది నా వ్యక్తిగత అభిప్రాయం.
 

tags: vishwaroopam2, vishwaroopam2 review, vishwaroopam2 movie, vishwaroopam2 movie review, vishwaroopam 2 film review, kamala vishwaroopam2, vishwaroopam2 rating

Related Post