ప‌వ‌న్ క‌ల్యాన్ టీవీ చాన‌ల్స్ తో కాంప్ర‌మైజ్‌..?

news02 April 29, 2018, 9:50 p.m. entertainment

Pawan kalyan war
హైద‌రాబాద్ః ఈ మ‌ధ్య తెలుగు సినీ ఇండ‌స్ట్రీ లో చిలికి చిలికి గాలి వానలా మాకరిన కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం అంద‌రికి తెలిసిందే.. ఈ వివాదంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ దూర‌టం.. ఆతర్వాత మూడు న్యూస్ చాన‌ల్స్ పై ప‌వ‌న్ యుద్దం మొద‌లుపెట్ట‌డం అంద‌రికి తెలిసిందే. ఎబీఎన్‌, టీవీ9, టీవీ5 చాన‌ళ్ళ‌ను బ‌హిష్క‌రించాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు పిలిపిచ్చారు. దీంతో ఇష్యూ మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ టీవీ చాన‌ళ్ళుగా మారింది.

Chiranjeevi

ఇప్ప‌టికే ఒక‌టి రెండు సార్లు అన్న‌పూర్ణ స్టూడియోలో స‌మావేశ‌మైన సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు మొత్తం తెలుగు న్యూస్  చాన‌ళ్ళ‌ను బ‌హిష్క‌రించాల‌నే ఆలోచ‌న చేశారు. టీవీ చాన‌ళ్ల‌కు సినిమా కార్య‌క్ర‌మాలే ఆయువుప‌ట్టు అని ఆ చాన‌ళ్ళ‌కు సినిమా ఫీడ్ ఇవ్వ‌టం మానేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే టీవీ చాన‌ళ్ళ య‌జ‌మానులు ప‌వ‌న్ క‌ల్యాన్ ను ఎక్క‌డినుంచి నరుక్కు రావాలో అక్క‌డి నుంచి ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. మూడు చాన‌ళ్ళ‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్ష‌మించ‌వ‌ద్ద‌ని ప‌ట్టుబ‌ట్టుకొని కూర్చున్న ప‌వ‌న్ .. ఎవ‌రు చెబితే మెత్త‌బ‌డ‌తాడో అత‌నినే మ‌ధ్య వ‌ర్తిగా ఆప‌రేష‌న్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

Pawan kalyan call for ban tv channels

ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ దాడి ఉదృతం చేయ‌టంతో ఇక చిరంజీవి ని రంగంలోకి దింపిన‌ట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే చెన్నై వేదిక‌గా టీవీ చాన‌ళ్ళ ప్ర‌తి నిధులు చిరంజీవితో స‌మావేశ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూను ఇంత‌టితో క్లోజ్ చేసేవిదంగా ప‌వ‌న్ ను ఒప్పించాలనే ప్ర‌తిపాద‌న‌ టీవీ చాన‌ళ్ళ ప్ర‌తినిధులు చిరంజీవి ముందు ఉంచినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ప‌వ‌న్ తో ఒక‌సారి మాట్లాడిన త‌ర్వాత మ‌ళ్ళీ స‌మావేశ‌మ‌వుదామ‌ని అనుకున్న‌ట్లు తెలుస్తో్ంది. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే మ‌ళ్ళీ వ‌ప‌న్ క‌ల్యాణ్‌, బ్యాన్ చేయాల‌ని భావిస్తున్న చాన‌ళ్ళ మ‌ద్య స్కేహం చిగురించే అవకాశం ఉంది. 

Related Post