బాగా నమ్మిన వ్యక్తే వంచించాడు..

news02 Sept. 27, 2018, 8:46 a.m. entertainment

padma

తన పదహారేళ్ల వయసులోనే జరగాల్సిందంతా జరిగిపోయిందని చెబుతోంది ప్రముఖ రచయిత్రి.. ఇండో అమెరికా టీవీ యాంకర్.. మోడల్ పద్మాలక్ష్మి. తనకు పదహారేళ్ల వయస్సు ఉన్నప్పుడు బాగా తెలిసిన వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆవేధన వ్యక్తం చేసింది. ఐతే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పుకోలేదని.. కనీసం తన తల్లికి కూడా చెప్పలేదని పద్మాలక్ష్మి తెలిపింది. 

padma lakshmi

ఇన్నాళ్ల తరువాత ఈ దారుణాన్ని ఆమె న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. తనకు పదహారు ఏళ్ల వయసు ఉన్నప్పుడు 23 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ చేశానని చెప్పింది పద్మాలక్ష్మి. ఐతే తమ బంధం మొదలైన కొన్నాళ్లకే ఆ యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆవేధన వ్యక్తం చేసింది. ఓ పురుషుడు కేవలం లైంగిక అవసరాల కోసమే స్త్రీతో బంధాన్ని కొనసాగిస్తాడా ఆని పద్మాలక్ష్మి ప్రశ్నించింది. 

padma

అంతే కాదు తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తన సవతి తండ్రి బంధువు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. కేవలం తన కూతురు తనలా బాధపడకూడదని ఈ విషయాలను చెబుతున్నట్లు పద్మాలక్ష్మి తెలిపింది. ఇక పద్మాలక్ష్మి ప్రముఖ బ్రిటీష్ రచయిత సల్మాన్ రష్దీని పెళ్లి చేసుకుని.. మూడేళ్ల తరువాత విడిపోయిన సంగతి తెలిసిందే.

 

 

tags: padma, padma lakshmi, padma lakshmi about dating, padma lakshmi on dating, padma lakshmi about first crush, padma lakshmi about love, padma lakshmi hot

Related Post