అచ్చు తన తండ్రి ఎన్టీఆర్ లాగే

news02 Jan. 3, 2019, 7:37 a.m. entertainment

balakrishna

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఈమేరకు ఎన్టీఆర్ కధానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని టైటిల్స్ ఖరారు చేశారు. ఇక ఈ సినిమాకు సంబందించి ఎప్పటి కప్పుడు కొత్త పోస్టర్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది ఎన్టీఆర్ టీమ్. శరవేగంగా షూటింగ్ జరుపుతూనే.. మరోవైపు ప్రమోషన్ పనులు చేపడుతోంది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన అన్ని స్టిల్స్, ట్రైలర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు నుంచి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లుక్‌తో కూడిన మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ అచ్చు తన తండ్రి ఎన్టీఆర్ లాగే.. అల్లూరి సీతారామరాజుగా ఒదిగిపోయారు. ఇంకేముంది ఈ పోస్టర్ చూసి నందమూరి అభిమానులు సంబరపడిపోతున్నారు. 

tags: balakrishna, balakrishna as aaluri, balakrishna as alluri seetharamaraju, balaiah as alluri, balaiah alluri getup in ntr biopic

Related Post