అత్యాచారాలకు సినిమాలే కారణమా..

news02 April 14, 2018, 10:15 p.m. entertainment

pawan kalyan on kadhuva rape

హైదరాబాద్- జమ్మూకశ్మీర్ అత్యాచార ఘటనపై హీరో.. జనసేని అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లల జోలికి వెళ్తే వారిని బహిరంగంగా తోలు తీయాలని ఆయన అన్నారు.  జమ్ముకశ్మీర్‌ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై మృగాల సామూహిక అత్యాచారం, హత్య తన హృదయాన్ని ద్రవింపజేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా విభాగం ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులతో పవన్‌ కళ్యాణ్ మాట్లాడాడు. జమ్ముకశ్మీర్ లో జరిగిన కథువా ఘటన మెదటిది కాదని అన్ పవన్... మన వ్యవస్థలో ఓ దుర్ఘటన జరిగితే కానీ చలనం రాదా అని ప్రశ్నించారు. నిర్భయ చట్టం కూడా దిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే వచ్చిందని పవన్ గుర్తు చేశారు. 

తమ కళ్ల ముందు జరిగితేనే ఎంపీలు స్పందిస్తారా అని నిలదీసిన ఆయన.. ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేసిన పవన్... అప్పుడే అందరికీ భయం పుడుతుందని అన్నారు. అత్యాచారం వంటి కేసుల్లో సింగపూర్‌ తరహాలో శిక్షలు అమలు చేయాలని... సినిమాల ప్రభావంతో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగాయని కొంత మంది అంటుంటారని.. కాని కథువాలో చిన్నారిపై అత్యాచారం.. హత్యకి సినిమాలు, కళలు ప్రేరేపించాయా.. లేక మనిషిలో పశువాంఛతో జరుగుతున్న ఘటనలు ఇవా అని పవన్ ఆవేధన వ్యక్తం చేశారు. పశువుకైనా ప్రకృతి నియమం ఉంటుందేమో గాని.. మానవ మృగాలకి ఇవేమీ ఉండటం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Related Post