ఒక్క ఫోటో దిగొచ్చా..?

news02 June 29, 2018, 5:37 p.m. entertainment

bahubali

టోక్యో: కుమార వ‌ర్మ కాలం ప్ర‌తి పిరికివాడికి ధీరుడుగా మారే ఒక అవ‌కాశం ఇస్తోంది. ఆ క్ష‌ణం ఇది. ప్రాణం పోసే వాడు దేవుడు...ప్రాణం నిల‌బెట్టే వాడు వైద్యుడు...ప్రాణం కాపాడే వాడు క్ష‌త్రియుడు. ఈమాట‌లు గుర్తున్నాయి క‌దా. మ‌న ద‌ర్శ‌క రారాజు రాజ‌మౌళి నిర్మించిన బాహుబ‌లి-2లోని మాట‌లు. పిండారిలు కుంతల దేశం మీద దండెత్తి ఆసామంత రాజ్యాన్ని కొల్ల‌గొట్టేందుకు వ‌చ్చిన‌ప్పుడు హీరో ప్ర‌భాస్ సుబ్బ‌రాజుతో అన్న మాట‌లివి.

bahu bali

కానీ, ఈమాట‌లు ఇప్పుడేందుకు చెబుతున్నార‌నే క‌దా మీ డౌట్‌. అయితే బాహుబ‌లి-2 మూవీని ఇటీవ‌లే జ‌పాన్‌లో రిలీజ్ చేశారు. ఈనేప‌థ్యంలోనే కుమార వ‌ర్మ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన సుబ్బరాజు జ‌పాన్ ప్ర‌జ‌ల‌కు బాగా న‌చ్చేశాండంటా...! అమాయ‌క‌పు ల‌క్ష‌ణాలున్న కుమార వ‌ర్మ క్యారెక్ట‌ర్‌తో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను సుబ్బారాజు విశేషంగా ఆక‌ట్టుకున్నాడంటా...! అక్క‌డ యువ‌త ఇప్పుడు సుబ్బ‌రాజుతో ఒక్క ఫోటో దిగితే చాల‌ని ఫీల‌వుతు న్నారంటా..! 

bahubali

అంతేకాదు బాహుబ‌లి-2 ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న జ‌ప‌నీస్ థియేట‌ర్ల‌లోకి సుబ్బరాజు కుమారవర్మ వేషం వేసుకొని వెళ్ల‌డంతో... అక్క‌డి వారు ఒక్క‌సారి ఉబ్బిత‌బ్బైపోయారంటా...! కుమార వ‌ర్మ‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డంతో పాటు...సెల్పీలు దిగి ధ‌న్యవాదాలు చెప్పారంటా..! 

bahubali

ఇప్పుడు ఇదే విష‌యాన్ని సుబ్బ‌రాజు ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేయ‌డంతో...సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మొత్తానికి బాహుబ‌లి ది కంక్లూజ‌న్ దెబ్బ‌కు మ‌న సుబ్బ‌రాజు జపనీల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్ట‌డ‌డ నిజంగా హ‌ర్షించ‌ద‌గిన విష‌య‌మే. 

tags: subbaraju in japan,

Related Post