త్వరలోనే బయటపెడతా..

news02 June 3, 2018, 8:47 a.m. entertainment

sri

సినిమా పిల్లర్- మొన్నామద్య కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తిన శ్రీరెడ్డి గుర్తుంది కదా.  తెలుగు పరిశ్రమలో మహిళలపై లైంగికంగా దోపిడీ చేస్తున్నారని ఆందోళనలు చేసిన నటి శ్రీరెడ్డి.. వినూత్న నిరసన తెలిపి సంచలనం రేపింది. ఇదిగో ఇప్పుడు మరో వార్త చెప్పి శ్రీరెడ్డి బాంబ్ పేల్చింది.. మెగా ఫామిలీ లో ఒకతను నాకు బాగా క్లోజ్, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

sri

ఇక శ్రీరెడ్డి ఫెస్ బుక్ లో అలా పోస్ట్ చేసింది.. మెగా ఫామిలీ లో ఒకతను నాకు బాగా క్లోస్... అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్... ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మొ  అంటారు.... టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తా.... అని శ్రీరెడ్డి అందులో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఐతే శ్రీరెడ్డి పోస్ట్ కు దానికి మెగా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

sri reddy

శ్రీ రెడ్డి పోస్ట్ కు ఓ అభిమాని స్పందిస్తూ.... నువ్వు చేసే పోరాటం వేరు.. రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్. నువ్వు ఏమైనా రాజకీయాల్లో రావాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తే... మరో అబిమాని.. నీపోరాటం నీవు చూసుకుంటే బావుంటుంది.. ఇతర అంశాల్లో వేలుపెడితే బావుండదని హెచ్చరించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శ్రీరెడ్డి పోస్ట్ పై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తున్నదే ఆసక్తిరేపుతోంది.

tags: sri reddy, sri reddy on megha family, sri reddy in facebook

Related Post