ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగిస్తున్న‌రంగ‌స్థ‌లం సాంగ్స్ ..!

news02 March 2, 2018, 8:49 p.m. entertainment


హైదరాబాద్ : రామ్ చ‌ర‌ణ్  హీరోగా స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న రంగ‌స్థ‌లం చిత్రంలోని రెండో పాట‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో రంగ .. రంగ .. రంగస్థలాన .. అంటూ సందడి చేస్తున్నారు రామ్ చరణ్ సంద‌డి చేశాడు . రంగస్థలం చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండ‌గా ... ఇందులో చరణ్‌ చిట్టిబాబు పాత్రలో వినికిడిలోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారు. ఇటీవల ఎంత సక్కగున్నావె .. అనే పాటను విడుదల చేసిన చిత్రం యూనిట్ తాజాగా రంగ .. రంగ .. రంగస్థలాన .. అనే మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 

ఈ సినిమాలో చిట్టిబాబు సౌండ్‌ ఇంజనీరు కాబట్టి  ‌.. వినపడేట్టు కాదురా.. కనపడేట్టు కొట్టండెహే.. అంటూ కళాకారుల్ని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత డ్రమ్ములు వాయించే తీరును చూసి చరణ్‌ చిందేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్‌, జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1985 నాటి ప‌ల్లెటూరి నేప‌థ్యాన్ని త‌ల‌పించేలా .. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

tags: Rangasthalam Film Second Song Realise

Related Post