బిగ్ బాస్-2 విజేత కౌశల్..

news02 Oct. 1, 2018, 8:34 a.m. entertainment

bigboss 2

బిగ్ బాస్-2 రియాల్టీ షో టైటిల్ కౌశల్ ను వరించింది. నిన్న జరిగిన ఫైనల్ ఫినాలేలో కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిచిచారు. ఈ మేరకు కౌశల్ కు 50లక్షల రూపాయల బహుమతిని అందించారు. ముందు నుంచి కౌశల్ బిగ్ బాస్ లో బాగా ఆడుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. సోషల్ మీడియాలో కౌశల్ కు మంచి సపోర్ట్ లభించింది. సింగర్ గీతా మాధురి కౌశల్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. చివరకు విజయం మాత్రం కౌశల్ నే వరించింది. 

bigboss2

ఇక సీజన్‌ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంటులు పాల్గొన్నారు. గీతా మాధురి,  శ్యామల, కిరీటి దామరాజు, దీప్తి సునైనా, అమిత్ తివారీ, దీప్తి నల్లమోతు, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, కౌశల్, తేజస్వి మదివాడ, గణేష్, సంజనా అన్నే, సామ్రాట్, నూతన్ నాయుడు, నందిని రాయ్, పూజా రామచంద్రన్ షోలో పాల్గొన్నారు. ఇక బిగ్ బాస్ 2 గ్రాండ్ ఫినాలేలో ముందు నుంచి షోలో పార్టీసిపేట్ చెసిన అందరు పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. వారంతా డ్యాన్స్ లతో షో ను అదరగొట్టేశారు. 
 

 

tags: bigboss, bigboss2, bigboss2 winner, bigboss2 winner koushal, bigboss2 final winner, koushal bigboss2 winner, venkatesh in bigboss2, bigboss2 grand finale

Related Post