Revanth vs KTR

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు- కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోదించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు కేటీఆర్. ఈ సందర్బంగా మాట్లాతూ.. రేవంత్ రెడ్డి నాకు 18 ఏళ్ల నుంచే తెలుసు.. ఆయన నాకు మంచి మిత్రుడు.. ఐతే గత పదేళ్ల నుంచి మాకు, ఆయనకు చెడింది.. ఆయన అదృష్టవంతుడు.. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంను ఏకవచనంతో పిలిచినందుకు ఎవరైనా బాధపడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను.. అని వివరణ ఇచ్చారు కేటీఆర్. కేటీఆర్ తనను ఉద్దేశించి మాట్లాడే సమయంలో సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ కనిపించారు. 


Comment As:

Comment (0)